Chandramukhi 2 latest Update : చంద్రముఖి 2 టీజర్ ?

Chandramukhi 2 latest Update

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2005 లో వచ్చిన చంద్రముఖి సినిమా గురించి అందరికి తెలిసిందే. పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో చంద్రముఖి పేరుతో డబ్ అయ్యి, తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది.

అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమలలో సూపర్ హిట్ సినిమాల సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న క్రమంలో చంద్రముఖి సినిమాకు కూడా సీక్వెల్ ప్లాన్ చేసారు. చాలా రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన కూడా రెగ్యులర్ అప్డేట్స్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు.

రాఘవ లారెన్స్, బాలీవుడ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ హర్రర్ కామెడీ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రేపు రివీల్ చేయబోతున్నట్టు చంద్రముఖి 2 నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

లైకా ప్రొడక్షన్ విడుదల చేసిన పోస్టర్ తో పాటు ఈ విధమైన డిస్క్రిప్షన్స్ జత చేసింది ” రాజాధి రాజా, రాజ గంభీర, రాజ మార్తాండ, రాజ కుల తిలగా… వెట్టయన్ రాజా పరాక్ పరాక్ పరాక్!! రేపు ఉదయం 10 గంటలకు మేము మా #వెట్టయన్ రూపాన్ని ఆవిష్కరిస్తాము” అంటూ రాసుకొచ్చారు అంటే చంద్రముఖి సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉన్న వేంకటపతి రాజావారి రూపాని ఆవిష్కరించబోతున్నట్టు వాళ్ళు తెలిపినట్టు స్పష్టమవుతోంది.

ఇప్పటి వరకు ఈ సినిమా స్టిల్స్ మాత్రమే రిలీజ్ చేసిన మూవీ టీం రేపు ఉదయం 10 గంటలకు గ్లిమ్స్ వీడియో గాని టీజర్ గాని విడుదల చేసే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఏం ఏం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాఫై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు