Boxoffice: “బ్రో” 2డేస్ కలెక్షన్స్.. బాగానే వచ్చాయికానీ?

Bro 2days collections:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన ఫ్యామిలి స్టారర్ “బ్రో” జులై 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా, మెల్లి, మెల్లిగా అడ్వాన్సు బుకింగ్స్ లతో రచ్చ చేసింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు లేకపోయినా, మంచి క్రేజీ ఓపెనింగ్స్ తో అదరగొట్టింది బ్రో సినిమా.

విడుదలైన ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 23కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టగా, ప్రపంచ వ్యాప్తంగా 30కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. 48కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా మంచి హోల్డ్ ని కంటిన్యూ చేసింది. ఇక బ్రో సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 10.38 కోట్ల షేర్ ని రాబట్టింది. అయితే దీనిలో 4.80 కోట్లు నైజాం నుండే రావడం విశేషం. ఇకపోతే వరల్డ్ వైడ్ గా బ్రో రెండో రోజు 12.32 కోట్లు వసూలు చేయడం జరిగింది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం లేకపోతే మరో రెండు కోట్లయినా వచ్చేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ ఓపెనింగ్స్ సినిమాకైతే సరిపోవని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 100కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన “బ్రో” సినిమా రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్ గా 42.33 కోట్ల షేర్ రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకా 55 కోట్ల వరకైనా రాబట్టాలి. ఇక మూడో రోజు సెలవు రోజు కావడంతో మంచి గ్రోత్ చూపించే అవకాశం ఉంది. అవుతున్న బుకింగ్స్ ని బట్టి మూడో రోజు “బ్రో” 15 కోట్లయినా వసూలు చేయవచ్చు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు