PSPK: ఆ భజన లేకుంటే “బ్రో” కి మరింత ప్లస్సయ్యేది?

Reason for negative response in bro movie?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా “బ్రో” జులై 28న రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. వినోదయ సితం రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను సముద్రఖని పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించాడు. ఇక సినిమా రిలీజ్ అయిన తరువాత రివ్యూలు ఎవరికి తోచినట్టు, వారు రకరకాలుగా ఇస్తున్నారు.

ఇక ఓపెనింగ్స్ మాత్రం టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ గానే వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎప్పుడు ఆడియన్స్, ఫ్యాన్స్ కోరుకునే ఎలెమెంట్స్ అన్ని ఇచ్చాడు డైరెక్టర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ కూడా చాలా ప్లస్ అయ్యాయి. అయితే అందులో కొన్ని పాయింట్స్ కామన్ ఆడియన్స్ కి కొంచెం ఎక్కువయ్యాయి అనే ఫీలింగ్ కలుగచేసాయి. అదేంటంటే “బ్రో” సినిమా లో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ నుండి ప్రీ క్లైమాక్స్ వరకు పలు సీన్లలో పవన్ కళ్యాణ్ పాత సినిమాల సాంగ్స్ బీట్ ని రిపీట్ చేయడం జరిగింది.

అవి మొదటి రెండు సీన్లలో బాగానే అనిపించినా, ప్రతిసారి రిపీట్ అవుతుండేసరికి ప్రేక్షకుడికి ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి. సినిమాలో అవసరం లేకపోయినా ఇన్ని క్లిప్స్ పెట్టడం ఒక రకంగా ట్రోలింగ్ కి కారణం అవుతుంది. బ్రో మూవీలో ఆ క్లిప్స్ లేకపోయి ఉంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యుండేదని, విమర్శకుల నుండి మరింత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక బ్రో రిలీజ్ అయిన ఫస్ట్ డే 48కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయగా రెండ్రోజుల్లో 70 కోట్ల మార్క్ ని దాటడం విశేషం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు