Vijay Devarakonda: దెబ్బ తిన్న కొద్దీ మరింత బలపడుతున్న విజయ్.. ఈసారి బాక్స్ ఆఫీస్లు రౌడీ సొంతం..!

Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మొదటిగా చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ కి అడుగుపెట్టిన విజయ్ .. 50 కోట్లకు పైగా మార్కెట్ ని ఇప్పుడు తన సొంతం చేసుకున్నాడు. అయితే విజయ్ దేవరకొండ సక్సెస్ లో ఉన్నప్పుడు భారీ ఫేమ్ అందుకున్నాడు అలాగే నెగిటివిటీ ని కూడా సొంతం చేసుకున్నాడు.

కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరైన దిశలో వెళ్లడం లేదు. ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విజయ్ డిజాస్టర్ గా నిలిచాడు. లైగర్ నుంచి ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ వరకూ తన కెరీర్ కి సరైన హిట్ పడలేదని చెప్పుకోవచ్చు. దీంతో రౌడి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లో గీతా గోవిందం, అర్జున్ రెడ్డి సాలిడ్ హిట్స్ ఎప్పుడు పడతాయా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Vijay is getting stronger as he gets hit
Vijay is getting stronger as he gets hit

ఇక ఇదిలా ఉంటే నిన్న అనగా మే తొమ్మిదవ తారీకున విజయ్ దేవరకొండ బర్తడే సందర్భంగా తన ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టారు మేకర్స్. జస్ట్ మూవీ అనౌన్స్మెంట్లతోనే విజయ్ ఆల్రెడీ హిట్ కొట్టేసాడు వైప్స్ కనిపిస్తున్నాయి. వీటితో తాను మాత్రం దెబ్బ తిన్న కొద్ది మరింత రాటుదేలుతున్నాడు తప్పితే అసలు తగ్గేదేలే ఎక్కడ అనిపించడం లేదు. ఇక ప్రస్తుతం తన నుంచి రానున్న ఈ మూడు సినిమాలపై సాలిడ్ బజ్ ఏర్పడింది. పోస్టర్లు కూడా వేరే లెవెల్ లో ఉండడంతో మునుపన్నడు లేని కొత్త కాన్సెప్ట్లతో విజయ్ ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు