Pan world movie: 53 ఏళ్ల క్రితమే పాన్ వరల్డ్ మూవీ.. ఆ ఘనత ఎవరికంటే..?

Pan world movie..ఇప్పుడైతే దర్శక ధీరుడు రాజమౌళి పుణ్యమా అని తెలుగు చిత్రాలు సరిహద్దులు దాటుతున్నాయి కానీ ఒకప్పుడు తెలుగు సినిమా కేవలం తెలుగు సినిమా పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యేది. అయితే ఇదిలా ఉండగా తెలుగు సినీ పరిశ్రమ గతంలో కృష్ణ పుణ్యమా అని సరిహద్దులు దాటింది.. అయితే ఈ విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఒక చిత్రం ఏకంగా 53 సంవత్సరాల క్రితమే 80 దేశాలలో రిలీజ్ అయ్యి.. తొలి పాన్ వరల్డ్ చిత్రంగా సంచలనం సృష్టించింది.

Pan world movie: Pan world movie 53 years ago.. Who has that feat..?
Pan world movie: Pan world movie 53 years ago.. Who has that feat..?

సాహసోపేతమైన చిత్రాలకు పెట్టింది పేరు కృష్ణ..

సూపర్ స్టార్ కృష్ణ కథల ఎంపికలో కానీ.. చిత్ర నిర్మాణంలో కానీ.. పర్ఫామెన్స్ విషయంలో కానీ.. ఎక్కడా రాజీ పడరు.. లాభనష్టాల గురించి అసలు ఆలోచించరు.. అందుకే ఆ దూకుడే ఆయనకు భారీ విజయాలను తెచ్చి పెడుతున్నాయి.. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం ఏదైనా ఉందంటే అది అల్లూరి సీతారామరాజు జీవితాన్ని తెరకెక్కించడమే.. స్వర్గీయ నందమూరి తారకరామారావు డ్రీమ్ ప్రాజెక్టుగా ఎన్నో రోజులు ప్రచారంలో ఉన్న ఈ సినిమాను చివరికి కృష్ణ తెరకెక్కించి రికార్డులను కొల్లగొట్టారు .. ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ తర్వాత ఇండియాలోనే మొదటి కౌబాయ్ చిత్రాన్ని నిర్మించి మరో సాహసాన్ని ప్రదర్శించారు సూపర్ స్టార్ కృష్ణ.

53 ఏళ్ల క్రితమే పాన్ వరల్డ్ మూవీ..

వాస్తవానికి ఈ మధ్యకాలంలో ఒక సినిమాను నాలుగైదు భాషల్లో విడుదల చేస్తున్నారు.. దీనిని పాన్ ఇండియా చిత్రం అని పిలుస్తున్నారు .. కానీ 53 ఏళ్ల క్రితమే “మోసగాళ్లకు మోసగాడు” అనే చిత్రాన్ని ఏకంగా 80 దేశాలలో సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు కృష్ణ.. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ వరల్డ్ మూవీగా రికార్డు సృష్టిస్తే.. 53 ఏళ్ల క్రితమే కృష్ణ ఈ చిత్రంతో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించి రికార్డు సృష్టించారు.. ఇకపోతే ఈ సినిమా నిర్మాణానికి ప్రేరణ ఏమిటి? తెలుగులో కౌబాయ్ సినిమా చేయాలని కృష్ణ ఎందుకు అనుకున్నారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

హాలీవుడ్ కౌబాయ్ చిత్రాలే ఆదర్శం..

వాస్తవానికి మన భారతదేశానికి.. కౌబాయ్ కల్చర్ కి అసలు సంబంధమే లేదు. మెక్సికో, సదరన్ యునైటెడ్ స్టేట్స్ లో మాత్రమే ఈ కౌబాయ్ కల్చర్ ఉంటుంది.. హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు విపరీతంగా వచ్చేవి.. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలలో కౌబాయ్ అంటే వెంటనే గుర్తొచ్చే హీరో క్లింట్ ఈస్ట్ వుడ్.. ఈయనే కౌబాయ్ పాత్రకు ప్రాణం పోశారు.. అయితే ఈ చిత్రాలను సూపర్ స్టార్ ఎక్కువగా చూసేవారట . ఈ నేపథ్యంలోనే మెకనాస్ గోల్డ్ , గుడ్ బ్యాడ్ అగ్లీ అనే కౌబాయ్ సినిమాలు చూసిన కృష్ణ వీటిని తెలుగులో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారట.. ఇక ఈ విషయాన్ని రచయిత ఆరుద్రతో చెప్పి కథ సిద్ధం చేయించారు.. ముఖ్యంగా గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమా కథను ఆధారం చేసుకుని.. 23 కౌబాయ్ సినిమాలు, రెండు ఇంగ్లీష్ నవలల ఆధారంగా తెలుగు నేటివిటీకి అనుగుణంగా అదృష్ట రేఖఅనే కథను సిద్ధం చేశారు.. ఆరుద్ర కథతో సినిమా చేయాలంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది.. అంత డబ్బుతో ఎక్స్పరిమెంట్ అంటే పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా అనే సందేహం కూడా కృష్ణకు వచ్చింది. అయితే డబ్బు గురించి ఆలోచన చేయని కృష్ణ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.. అందులో భాగంగానే కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ మొదలైంది.. అప్పటివరకు అన్ని సినిమాలు ఇండోర్లోనే షూటింగ్ జరిగేవి.. కానీ మొదటిసారి ఈ సినిమా కి అవుట్డోర్లో షూటింగ్ చేయడం గమనార్హం . అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను మెప్పించలేదు.. ఇలాంటి తరహా సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం కష్టమని చాలా మంది చెప్పుకున్నారు..

పాన్ వరల్డ్ మూవీగా మోసగాళ్లకు మోసగాడు..

కానీ ఎన్టీ రామారావు మాత్రం భిన్నంగా ఉందని తప్పకుండా హిట్ అవుతుందని చెప్పారట.. ఇక తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకొని అదే కాన్సెప్ట్ తో 1971 ఆగస్టు 27న మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని రిలీజ్ చేశారు.. ఇక ఈ సినిమా విడుదలై కొత్త ట్రెండును క్రియేట్ చేసింది.. ఇంగ్లీషులో డబ్ చేసి విడుదల చేయగా.. అక్కడ కూడా విశేషమైన ఆదరణ లభించింది.. ఆ రోజుల్లోనే కలర్ లో ఈ సినిమా తీయాలంటే రూ .12 లక్షల వరకు బడ్జెట్ అయ్యేది. అలాంటిది ఈ సినిమాకు 7 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది.. అందులోనూ 28 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి సంచలనం సృష్టించారు కృష్ణ… ఇక తర్వాత చిరంజీవి , మహేష్ బాబు లాంటివాళ్ళు ఈ కౌబాయ్ తరహా సినిమాలు చేశారు కానీ పెద్దగా విజయాన్ని అందుకోలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు