New Music Sensation: హేశం అబ్దుల్ వహాబ్

New Music Sensation “Hesham Abdul Wahab”

పలకడానికి కాస్త పెద్దగా ఉన్న హేశం అబ్దుల్ వహాబ్ పేరును తొందర్లోనే తెలుగు ప్రేక్షకులు బాగా గుర్తుంచుకోవలసి వస్తుందనిపిస్తోంది. అసలు ఎవరి హేశం అబ్దుల్ వహాబ్ అనే కదా అనుకుంటున్నారు. ఈయన లేటెస్ట్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అని చెప్పడం ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు.

హేశం అబ్దుల్ వహాబ్ ను ఒక్క పాటతో గుర్తు చేయాలంటే మలయాళంలో సూపర్ హిట్టైన దర్శన అనే సాంగ్ గురించి చెప్పాలి. వినడానికి ఇది మలయాళం సాంగ్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఈ పాట సుపరిచితమే. కొన్ని పాటలు భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆ కోవకు చెందిన పాటనే ఈ దర్శన పాట కూడా. చాలా రోజులు తరువాత బాషా బేధం లేకుండా అన్ని భాషల్లో సూపర్ హిట్టైన ఈ సాంగ్ పాడింది, కంపోజ్ చేసింది హేశం అబ్దుల్ వహాబె.

ఫ్రెష్ మ్యూజిక్ తో, ప్రేక్షకులను ఆకట్టుకునే ట్యూన్స్ తో మలయాళం లో సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హేశం అబ్దుల్ వహాబ్ ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న ఖుషి సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -

ఇప్పటికే రిలీజైన మూడు పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇటీవలనే రిలీజ్ చేసిన ఖుషి టైటిల్ సాంగ్ అయితే ఇన్స్టంట్ గా అందరికి కనెక్ట్ అయ్యి రింగ్ టోన్స్ కలర్ ట్యూన్స్ గా పెట్టుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఐతే థమన్, లేదంటే దేవి శ్రీ ప్రసాద్, లేక అనిరుధ్ అంటూ మేజర్ గా వీళ్ళ ముగ్గురి పేరే వినిపిస్తున్న క్రమంలో హేశం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందరిని మెస్మరైజ్ చేస్తుంది.

ప్రస్తుతం ఈయన తెలుగులో ఖుషి సినిమాతో నాని లేటెస్ట్ చిత్రం హాయ్ నాన్న మరియు శర్వానంద్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఒక్కసారి గనక ఈ సినిమాలు రిలీజైతే హేశం అబ్దుల్ వహాబ్ తెలుగులో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ లు చాలా కనిపిస్తున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు