Jailer’s Hukum song released: తెలుగులోను మొదలైన జైలర్ సందడి

Jailer’s Hukum song released

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ చిత్రం జైలర్ సందడి తెలుగులోనూ మొదలైంది. గత కొద్దీ రోజులుగా యూట్యూబ్ లో తమిళ్ వెర్షన్ లో జైలర్ పాటలు సందడి చేస్తుండగా, తెలుగులో ఈ పాటలు ఎప్పుడు విడుదల అవుతాయని ఈగర్ గా వెయిట్ చేస్తున్న రజనీ కాంత్ అభిమానులకు మొత్తానికి గుడ్ న్యూస్ అందింది.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో మిల్క్ బ్యూటీ తమన్నా, రజనీకాంత్ ప్రధాన తారాగణంగా రాబోతున్న జైలర్ సినిమా పాటలు తెలుగులో కూడా విడుదల అవబోతున్నాయి. ఇటీవలనే చెన్నై లో ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆనిరుద్ రవి చందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా. ఇప్పటికే రిలీజైన జైలర్ సినిమా రెండు పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 10న గ్రాండ్ గా రిలీజవ్వబోతుంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో తెలుగులోను సినిమా బజ్ పెంచాలనే ఉద్దేశ్యంతో ఎలాంటి అప్డేట్ లేకుండా జైలర్ లోకి రజిని ఇంత్రో సాంగ్ అయిన హుకుం పాటను తెలుగులో రిలీజ్ చేసారు మూవీ యూనిట్. ఈ హుకుం పాటకు ముందే కావాలా అనే సాంగ్ రిలీజ్ చేయగా ఆ పాట కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన హుకుం పాట తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాసేపటి క్రితమే రిలీజైన ఈ పాటపై సోషల్ మీడియా యువత పోస్ట్ లు వేస్తూ రజనీకాంత్ పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు