Mahesh babu: బర్త్ డే రోజు “బిజినెస్ మెన్” వీరంగం!

Business Men Movie Re Release

టాలీవుడ్ లో గత కొంత కాలంగా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల బర్త్ డేలకి, లేక పోతే ఆయా సినిమాల స్పెషల్ డే లకి పలు సినిమాలని రీ రిలీజ్ చేస్తూ, ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. కొన్ని సినిమాలు ఫ్యాన్సే సొంతంగా రిలీజ్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ స్టార్ట్ అయ్యిందే “పోకిరి” సినిమాతో.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి రీ రిలీజ్ అయ్యి కూడా సంచలన విజయం సాధించింది. ఇక ఆ తరువాత దీనిలాగే ఖుషి, ఆరెంజ్, ఒక్కడు, సింహాద్రి లాంటి సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఒక సాలిడ్ సినిమా రీ రిలీజ్ అవుతుంది.

అదే మహేష్ బాబు హీరోగా నటించిన “బిజినెస్ మెన్”. మహేష్ బాబు పూరిజగన్నాథ్ రెండో కలయికలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా మహేష్ లోని యాంగ్రీ వేరియెషన్స్ ని చూపించింది. ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ కే కాకుండా ఇతర హీరోల అభిమానులకి కూడా బాగా నచ్చుతుంది. ఆ రోజుల్లో పూరి జగన్నాథ్ కేవలం మూడు నెలల్లో షూటింగ్ ఫినిష్ చేసి రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు.

- Advertisement -

బిజినెస్ మెన్ లో డైలాగ్స్ కి కానీ, సాంగ్స్ కి గాని ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. “సూర్య భాయ్” అన్న ఒక్క పేరుతో ఇండస్ట్రీ ని షేక్ చేసిన ఈ సినిమా ఆగష్టు9 న మహేష్ బాబు బర్త్ డే కానుకగా రీ రిలీజ్ అవుతుంది. ఇక టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల రికార్డులన్నీ ఇప్పుడు బ్రేక్ చేయడానికి ఈ బిజినెస్ మెన్ రెడీ అయ్యాడని చెప్పాలి. మరి రీ రిలీజ్ లో బిజినెస్ మెన్ ఏ రేంజ్ లో వీరంగం సృష్టిస్తాడో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు