Allu arjun’s pushpa2 : పుష్ప రాజ్ కు ఐటెం భామ దొరికేసింది

Allu arjun’s pushpa2

ఇండియాస్ మోస్ట్ యాన్టిస్పెటెడ్ సినిమా పుష్ప ది రూల్ గురించి అందరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సుకుమార్ పుష్ప పార్ట్ వన్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకొని పుష్ప 2 సినిమాను ఏ విషయంలోనూ కంప్రమైజ్ అవకుండా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

అయితే ఇక విషయానికొస్తే పుష్ప పార్ట్ వన్ సినిమా హిట్ అవడానికి కథ, కథనం ఎంత తోడ్పడిందో అలాగే సాంగ్స్ కూడా చాలా వరకు సినిమా విజయంలో భాగం అయ్యాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కు దేశమంతా చిందులేసింది. టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ రీల్స్ లో మరియు అన్నీ రకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో పుష్ప పాటలు విపరీతంగా ట్రెండ్ అయిన సంగతి అందరికి తెలిసిందే.

పుష్ప సినిమా పాటలన్నింటిలో ఎక్కువ పాపులరైంది మాత్రం ఊ అంటావా మావ అనే ఐటెం సాంగ్. కాగా ఈ ఐటెం సాంగ్ అంతగా పాపులర్ అవడానికి ప్రధాన కారణం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఈ ఐటెం సాంగ్ కు స్టెప్స్ వేయడమే అయితే మరీ ఇంతగా ప్రాధాన్యత తెచ్చుకున్నా ఈ ఐటెం సాంగ్ తరహాలోనే పుష్ప పార్ట్ 2 లో కూడా ఐటెం సాంగ్ ను పెట్టడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట

- Advertisement -

అయితే ఈ ఐటెం సాంగ్ కు కోసం గాను ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హప్పెనింగ్ యాక్ట్రెస్ గా కొనసాగుతున్న శ్రీలీల తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా పుష్ప 2 లో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ భామలను పుష్ప మేకర్స్ అప్రోచ్ అవుతున్నారని సమాచారం అందుతోంది. పుష్ప సినిమాకు హిందీలో మంచి క్రేజ్ లభించటం వల్లనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీలైన కియార్ అద్వానీ మరియు దిశా పటాని లేకపోతే కృతి సనన్ వీళ్ళలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయడానికి చూస్తున్నారట. మరో పక్క బాహుబలి సినిమాలో మనోహరి పాట తరహాలో ముగ్గురితోను ఐటెం సాంగ్ చేయించే ఆలోచన కూడా ఉందని టాక్

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు