Allu arjun’s pushpa2 : ఆ ఒక్క తప్పు చేయకుంటే పుష్ప2 ను ఎవరు ఆపలేరు

Allu arjun’s pushpa2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఇండియా వైడ్ ఎంత పెద్ద సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రిలీజ్ రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మహా అయితే యావరేజ్ సినిమా అవుతుందనుకున్నారు అందరు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ క్రియేట్ చేసింది.

ఇక ఇటీవలనే పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. సాధారణంగా బాలీవుడ్ నటులను మాత్రమే వరించే ఈ అవార్డు టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ కు రావడంతో తెలుగు సినీ పరిశ్రమలో నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే దాదాపు సంవత్సరం నుంచి ఈ సినిమాకు సంబందించిన వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి.

కానీ ఈ సినిమా మాత్రం ఇప్పటివరకు కేవలం 40 శాతం షూటింగ్ మాత్రమే కంప్లిట్ చేసుకుందని టాక్ నడుస్తుంది. మరీ ఇంత నత్త నడకన ఈ సినిమాను షూట్ చేయడానికి ప్రధాన కారణం పుష్ప సినిమాపై ఉన్న భారీ అంచనాలనే తెలుస్తుంది. పుష్ప సినిమా మొదటి పార్ట్ కు ఎలాంటి అంచనాలు గాని హ్యూజ్ బజ్ గాని లేదు. కానీ పుష్ప హిట్ అవడంతో పుష్ప 2 కు హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది.

- Advertisement -

అంతేకాకుండా బాలీవుడ్ నుంచి కూడా ఈ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దాంతో పుష్ప 2 లో బాలీవుడ్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకోడానికి అల్లు అర్జున్ భారీ యాక్షన్ స్టంట్స్ చేస్తున్నాడట.. అందుకే ఈ సినిమా షూటింగ్ నానాటికి ఆలస్యం అవుతుందని సమాచారం అందుతోంది. అయితే ఈ విధంగా చేయడం మొదటి ముప్పు అని తెలుస్తుంది. ఎందుకంటే ఈ రకమైన యాక్షన్ సీక్వెన్స్ లు కథకు అనుగుణంగా ఉంటె తప్ప సినిమాకు ఇవి ప్లస్ అవ్వవు. పైగా వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన కూడా కథ మారే ప్రమాదం ఉంటుంది.

పుష్ప సినిమా కథలో ఒక ఒరిజినాలిటీ ఉండటం వల్లనే పుష్ప సినిమా మొదటి పార్ట్ అంత విజయం సాధించింది. ఇప్పుడు ఒక వర్గాన్ని మెప్పించాలని అనవసరమైన యాక్షన్ సన్నివేశాలు చేస్తే మాత్రం సినిమా పెడదారి పట్టడం ఖాయం. పుష్ప హిట్ అవ్వాలంటే సుకుమార్, బన్నీలు ఈ తప్పు చేయకపోతే చాలు పుష్ప సినిమాను ఎవరు ఆపలేరు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు