RC16 latest update : పకడ్బందీ ప్లానింగ్ తో రెడీ అవుతున్న బుచ్చి బాబు

RC16 latest update

పాన్ ఇండియా సినిమా చేయడమంటే మజాక్ కాదు. హీరోలను, ప్రొడ్యూసర్స్ ను మభ్య పెట్టి సినిమా తీసి, రిలీజ్ చేసిన కూడా ఆ సినిమాలో విషయం లేకపోతే సినిమా ఫ్లాప్ అవడాన్ని ఎవరు ఆపలేరు. అందుకే పాన్ ఇండియా సినిమా తీసే విషయంలో దర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అరకొర నాలెడ్జ్ తో సినిమా తీస్తే ఆ సినిమా ఒక ఆదిపురుష్, ఒక రాధేశ్యామ్  అవడం తప్పని సరి.

అయితే ఈ విషయాలను డైరెక్టర్ బుచ్చి బాబు ముందుగానే గ్రహించినట్టు ఉన్నాడు. అందుకే బుచ్చి బాబు రామ్ చరణ్ తో చేయబోయే సినిమా విషయంలో చాలా పకడ్బందీ ప్లానింగ్ తో అడుగులు వేస్తున్నాడు.

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేసిన బుచ్చి బాబు 2021 లో వచ్చిన ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చి బాబు ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో అతి త్వరలోనే సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీస్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఈ సినిమా రంగస్థలం తరహాలో అవుట్ అండ్ అవుట్ రస్టిక్ సినిమాగా ఉండబోతుందట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా రూపొందుతుందని సమాచారం.

- Advertisement -

కాగా బుచ్చి చరణ్ సినిమా కోసం ఉత్తరాంధ్ర పుట్టి పెరిగిన లోకల్ రైటర్స్ సహాయం కూడా తీసుకోబోతున్నడట. ఉత్తరాంధ్ర లో ఉండే మనుషుల పద్ధతులు, బాడీ లాంగ్వేజ్, యాస అన్నింటిలోనూ సహజత్వాన్ని ప్రతిబింబిచేలా ప్రతి జాగ్రత్తను బుచ్చి బాబు తీసుకుంటున్నాడని సమాచారం అందుతోంది. చరణ్ సినిమాకు సంబంధించి కొత్త ఆఫీస్ కూడా ఓపెన్ చేసారు మేకర్స్. ఇక నుండి ప్రి ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసి, గేమ్ చేంజర్ కంప్లిట్ అవ్వగానే బుచ్చి బాబు రామ్ చరణ్ ల సినిమా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు