Sreeleela latest movie : మాస్ మహారాజ్ తో మరోసారి.?

Sreeleela latest movie

ఇండస్ట్రీలో మోస్ట్ ఎనర్జిటిక్ హీరో అంటే టక్కున గుర్తొచ్చేది రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన రవితేజ, ఆ తర్వాత నటుడిగా, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి వంటి సినిమాలు రవితేజ కు మంచి గుర్తింపును తీసుకుని వచ్చాయి.

ఇక రీసెంట్ టైమ్స్ లో రవితేజ తో రిపీట్ గా వర్క్ చేసిన డైరెక్టర్ అంటే గోపీచంద్ మలినేని. డాన్ శీను , బలుపు , క్రాక్ వంటి సినిమాలతో రవితేజ కు మంచి హిట్స్ ఇచ్చిన గోపిచంద్ మలినేనితో మరోమారు రవితేజ సినిమాను చేయనున్నాడు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ లెవెల్లో నిర్మించనుంది . ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో అనౌన్స్ కానున్నాయి.

ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ టాపిక్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కెర్లు కొడుతుంది. అయితే ఈ సినిమాలో రవితేజ సరసన మరోమారు శ్రీలీల నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే ధమాకా సినిమాలో రవితేజ సరసన జతకట్టి దుమ్ములేపిన శ్రీలీల ఇప్పుడు మరోసారి మాస్ మహారాజ తో పాటు నటిస్తే ఈ సినిమాకి కూడా పెద్ద ప్లస్ అవుతుంది. శ్రీలీల నే హీరోయిన్ గా తీసుకున్నారని టాక్. ఇక ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు