ketika sharma : మెగా ఫ్యామిలీ మోసం చేసింది

ketika sharma

ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచమైన కేతిక శర్మ గురించి అందరికి తెలిసిందే. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ రొమాంటిక్ సినిమాలో ఎక్స్ పోజింగ్ కు ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా రెచ్చిపోయి మరీ కేతిక శర్మ నటించింది.

ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత కేతిక శర్మ ఆమె అందం, అభినయంతో అందరి దృష్టిలో పడింది. అయితే మొదటి సినిమా హిట్ కోసం ఏ హీరోయిన్ కూడా చేయని అన్నిరకాల ప్రయత్నాలు చేసిన కూడా ఈ అమ్మడు దురదృష్టం కొద్దీ రొమాంటిక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది.దాంతో స్టార్ హీరోయిన్ గా మారడానికి అన్నీ అర్హతలున్నా కేతిక మొదటి ప్రయత్నం విఫలమైంది.

ఇక ఈ సినిమా తరువాత నాగ శౌర్యతో కలిసి లక్ష్య అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అప్పటికే ఒక ఫ్లాప్ సినిమా ఎక్స్ పీరియెన్స్ చూసేసిన కేతిక లక్ష్య ను లైట్ తీసుకుంది. ఇక అప్పుడే కేతిక శర్మ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. మెగా ఫ్యామిలీ హీరోలతో నటించే అవకాశం వచ్చిందంటే కెరీర్ కాస్త ముందుకెళ్ళినట్టే అనుకుంది కేతిక. కాని ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్ సినిమాలు పడటంతో కేతిక శర్మ కెరీర్ అయిపోయిందనుకున్నారంతా కానీ లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

- Advertisement -

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో భారీ అంచనాలు మధ్య రిలీజైన ఈ బ్రో సినిమా తో కేతిక జాతకం మారుతుందేమో అనుకుంటే, ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యి కేతిక కెరీర్ ను శర మాములుగా మార్చేసింది. అయితే కేతిక శర్మ నటించిన మొదటి రెండు సినిమాలు స్టార్ పవర్ లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాయి. కనీసం అయితే మెగా హీరోలైన హిట్ ఇస్తారని కేతిక శర్మ బోలెడు ఆశలు పెట్టుకుంటే చివరికి మెగా హీరోలు కూడా కేతిక శర్మ ను మోసం చేసారు.మరీ అమ్మడు ఇంకేళ్ళకు హిట్ మొహం చూస్తుందో చూడాలి

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు