Naga Chaitanya new girl friend : టాలీవుడ్ హీరోయిన్ తో నాగచైతన్య రిలేషన్షిప్ ?

Naga Chaitanya new girl friend

టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు నాగచైతన్య. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్యకు సాలిడ్ హిట్ లేదు. సోగ్గాడే క్రేజ్ తో బంగార్రాజు జస్ట్ బ్రేక్ ఈవెన్ మార్క్ ను టచ్ చేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన థాంక్యూ రెండో రోజే దుకాణం సర్దేసింది.

మనం వంటి మర్చిపోలేని హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ సైతం ఈసారి నాగచైతన్యను కాపాడలేకపోయాడు. గంపడంత ఆశలు పెట్టుకున్న లాల్ సింగ్ చద్దా బాలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఇక సమంతతో విడాకుల అనంతరం హీరో నాగచైతన్య… శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడంటూ పలు రూమర్స్ పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నాగచైతన్యకు సంబంధించి ఒక పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇందులో చైతో పాటు ఒక అమ్మాయి ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని ఉంది. దీంతో అందరూ చైతూ మరో అమ్మాయితో తిరుగుతున్నాడని వార్తలు మొదలయ్యాయి. కానీ నిజానికి ఈ ఫోటోలో ఉంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. నాగచైతన్య, రకుల్ కాంబినేషన్ లో వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా టైములో తీసుకున్న ఫోటో. అయితే ప్రజెంట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… చై నిజంగానే ఆ అమ్మాయితో తిరుగుతున్నాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు