Big boss7 latest update : బిగ్ బాస్ లోకి ఆ బోల్డ్ బ్యూటీ

Big boss7 latest update

మలయాళ శృంగార చిత్రాలతో ఇండియా వైడ్ పాపులరైన నటి షకీలా గురించి అందరికి తెలిసిందే. ఒకప్పుడు మలయాళంలో రెగ్యులర్ సినిమాలకు పోటీగా ఆమె నటించిన సినిమాలు రిలీజై, బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునేవని మలయాళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు మాట్లాడుకోవడం బహిర్గతమే. కాగా బోల్డ్ సినిమాలతోనే స్టార్ హీరో రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న నటి షకీలా తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 అడుగుపెడుతోందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో గట్టిగ వినిపిస్తోంది.

కన్నడలో ఆల్రెడీ షకీలా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది. నాలుగు వారాల పాటు ఆ షో లో హల్చల్ చేసిన షకీలా ఆ తరువాత ఎలిమినేట్ అయింది. ఇక లేటెస్ట్ గా తెలుగు బిగ్ బాస్ లోను ఆమె పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయిందని టాక్. ఇందుకోసం ఆల్రెడీ ఆమెకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను కూడా బిగ్ బాస్ యాజమాన్యం షూట్ చేశారట. సెప్టెంబర్ 3 నుంచి మొదలవబోతున్న బిగ్ బాస్ ఈసారి కొత్త కాన్సెప్ట్స్ లతో అలరించబోతుందట.

అయితే షకీలా లాంటి బోల్డ్ బ్యూటీని బిగ్ బాస్ లో తీసుకోవడానికి ప్రధాన కారణం కాంట్రావర్సీనే అని తెలుస్తుంది. బిగ్ బాస్ ఆరవ సీజన్ దారుణంగా ఫ్లాప్ అవడం వల్ల ఈసారి ఎలాగైనా సీజన్ సెవెన్ ను హిట్ చేయాలనే ఉద్దేశ్యంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. ఒక్క షకీలా లనే కాదు ఇటీవల కాలంలో పలు కాంట్రావర్సీలతో పాపులరైన ఇంకా చాలా మందినే బిగ్ బాస్ టీం సెలెక్ట్ చేసిందట. దీన్ని బట్టి చూస్తే ఈసారి బిగ్ బాస్ డోస్ మరింత పెరిగినట్టేనని స్పష్టమవుతోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు