Geetanjali: అంజలికి ఈ సీక్వెల్ అయినా కలిసొస్తుందా..?

Geetanjali

‘అంజలి’ ఈ జెనరేషన్ లో ఉన్న అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో ఒకరు. హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ సరైన అవకాశాలు లేక కోలీవుడ్ వెళ్లి స్థిరపడింది. ఆ తర్వాత షాపింగ్ మాల్, జర్నీ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులో గుర్తింపు పొంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఛాన్స్ అందుకుంది.

అయినప్పటికీ తెలుగులో సరైన ఆఫర్లు రాలేదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్ర పోషించినప్పటికీ పెద్దగా ఫలితం రాలేదు. ప్రస్తుతం ఓటీటీలో వెబ్ సిరీస్ లు సైతం చేస్తున్న అంజలికి తెలుగులో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం వస్తోంది.

అంజలి టైటిల్ రోల్ లో నటించిన గీతాంజలి సినిమాకి సీక్వెల్ వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. 2014లో హారర్ జానర్ కి బాగా డిమాండ్ ఉన్న రోజుల్లో కమర్షియల్ గా సక్సెస్ అయిన ఈ సినిమా ద్వారా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా మారారు. ఈ సినిమాకు స్టోరీ ఇవ్వటమే కాకుండా ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కోన వెంకట్ ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

కోన వెంకట్ తన ఫ్రెండ్ కి దర్శకత్వ బాధ్యతలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలి ఉంటుందా లేక వేరే హీరోయిన్ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ అంజలినే ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేస్తే గనక తనని ప్రూవ్ చేసుకోవటానికి మరో ఛాన్స్ వచ్చినట్లే అని చెప్పాలి. మళ్ళీ వచ్చింది గీతాంజలి అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సీక్వెల్ ద్వారా అంజలి కమ్ బ్యాక్ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు