Gudumba Shankar Rerelease: ఈ సినిమాకు కూడా రీరిలీజ్ దెబ్బ తప్పేలా లేదు..!

Gudumba Shankar Rerelease

టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ జోరుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఇండస్ట్రీ హిట్స్ అయిన సినిమాలను మాత్రమే కాకుండా అండర్ రేటెడ్ సినిమాలను కూడా రీరిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ రేంజ్ లో హిట్ చేస్తున్నారు. స్ట్రైట్ సినిమాలనే కాకుండా సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి డబ్బింగ్ సినిమాకి కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మరో డబ్బింగ్ సినిమా 7జి బృందావన్ కాలనీ ని కూడా రీరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక్కడివరకూ బాగానే ఉన్నా కానీ, ఈ రీరిలీజ్ ల ట్రెండ్ కొన్ని సినిమాల పట్ల శాపంగా మారుతోంది. క్రేజ్ ఉన్న సినిమాలు రీరిలీజ్ అయిన సమయంలో చిన్న సినిమాలు, యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు ఆక్యుపెన్సీ భారీగా పడిపోవడానికి కారణం రీరిలీజ్ సినిమాలే అన్నది చాలా మంది అభిప్రాయం.

ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా సమంత, విజయ్ ల ఖుషి సినిమాకు కూడా ఈ రీరిలీజ్ టెన్షన్ మొదలైంది. సెప్టెంబర్ 1న ఖుషి సినిమా రిలీజ్ కానుండగా, పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా సెప్టెంబర్ 2న గుడుంబా శంకర్ సినిమాను రీరిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. నిజానికి గుడుంబా శంకర్ సినిమా ఏమంత గొప్పగా ఉండకపోయినా ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్స్ గా ఉన్నాయి. సినిమా కోసం కాకపోయినా సాంగ్స్ కోసం అయినా ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఖుషి సినిమాకి టాక్ ఏ మాత్రం తేడాగా వచ్చినా కూడా సెకెండ్ డే నుండి ఆక్యుపెన్సీ భారీగా డ్రాప్ అయ్యే ప్రమాదం ఉంది.మరి, శాకుంతలం, లైగర్ లాంటి డిజాస్టర్స్ తో ఉన్న సమంత, విజయ్ దేవరకొండకు ఖుషి రూపంలో అయినా బ్లాక్ బస్టర్ అందుతుందా లేక గుడుంబా శంకర్ రీరిలీజ్ దెబ్బ తీస్తోందా అన్నది వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు