Samantha and VD’s Kushi: ఖుషి కి అదే మైనస్ అవుతుందా..?

Samantha and VD’s Kushi

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడి సూపర్ స్టార్ సమంత కాంబినేషన్లో శివ నిర్వాణ డైరెక్షన్లో రూపొందిన ఖుషి  సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. లైగర్, శాకుంతలం లాంటి డిజాస్టర్ల తర్వాత వస్తున్న ఈ సినిమా హిట్ అవ్వటం ఇద్దరికీ కీలకంగా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పాజిటివ్ ఎలిమెంట్ గా కనిపిస్తున్న ఈ సినిమాకి డ్యూరేషన్ మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సెన్సార్ నుండి యుఎ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా డ్యూరేషన్ 2గంటల 45నిముషాలు ఉందని సమాచారం.
రొమాంటిక్ లవ్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఇంత డ్యూరేషన్ అంటే రిస్క్ అనే చెప్పాలి. సినిమాలో ఎమోషన్ ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వకపోతే గనక అంత సేపు థియేటర్లో కూర్చోవడం అనేది కష్టం అవుతుంది. ఇంచు మించు సేమ్ కాన్సెప్ట్ తో నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన అంటే సుందరానికి సినిమా ఆడియెన్స్ ని ఎంగేజ్ చేయలేకపోవటానికి ప్రధాన కారణం సినిమా డ్యూరేషన్ అనే చెప్పాలి.
సినిమాలో ఆ మాత్రం కంటెంట్ లేనిది డైరెక్టర్ శివ నిర్వాణ అంత డ్యూరేషన్ పెట్టి రిస్క్ చేయడని చెప్పచ్చు.గత చిత్రం టక్ జగదీష్ నిరాశపరిచిన క్రమంలో ఈ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకొని తన సత్తా చాటాలని కసితో ఉన్నాడు డైరెక్టర్ శివ నిర్వాణ. మరి, విజయ్ సమంతల కెరీర్ కి బ్లాక్ బస్టర్ తప్పనిసరైన పరిస్థితిలో వస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుంది అన్నది వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు