Boys Hostel: సక్సెస్ ఫార్ములాను రిపీట్ చేస్తున్న చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్..!

Boys Hostel

ఒక యూట్యూబ్ ఛానల్ స్థాయి నుండి ఫిలిం ప్రొడక్షన్ హౌస్ స్థాయికి ఎదిగిన సంస్థ చాయ్ బిస్కెట్. ఇటీవల మేమ్ ఫేమస్ సినిమా ద్వారా డీసెంట్ హిట్ అందుకున్న ఈ సంస్థ ఇప్పుడు బాయ్స్ హాస్టల్ అనే డబ్బింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మేమ్ ఫేమస్ సినిమా విషయంలో ఫాలో అయిన స్ట్రాటజీనే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. మేమ్ ఫేమస్ సినిమా రిలీజ్ కి ముందుగా సెలెక్టెడ్ సెంటర్స్ ల ప్రీమియర్స్ వేసి సినిమా మీద పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నారు మేకర్స్. ఇప్పుడు తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన ఈ డబ్బింగ్ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములా రిపీట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.
హాస్టల్ హుడుగారే బెకాగిదరే పేరిట రిలీజై కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాకు రష్మీ ఎపిసోడ్ యాడ్ చేసి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం కామెడీతో ఆకట్టుకున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఆగస్టు 26న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఒక రోజు ముందుగా సెలెక్టెడ్ ఏరియాస్ లో ప్రీమియర్స్ వేయాలని డిసైడ్ అయ్యిందట సినిమా యూనిట్.
ఇటీవల కాలంలో ప్రీమియర్స్ చిన్న సినిమాలకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేయటంలో బాగా హెల్ప్ అయ్యాయనే చెప్పాలి. సామజవరగమన, బేబీ, వంటి సినిమాలకు ఫస్ట్ షోతోనే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావటమే ఇందుకు నిదర్శనం. సినిమా కంటెంట్ నచ్చితే ఏ భాషలో రూపొందిన సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తున్న ఈ రోజుల్లో బాయ్స్ హాస్టల్ సినిమాకు ప్రీమియర్స్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే గనక బ్లాక్ బస్టర్ అవ్వటం ఖాయం అనే చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు