Ustaad Bhagat Singh: పూజా హెగ్డే కి మరో షాక్ – అతడు కూడా హ్యాండ్ ఇచ్చాడా..?

Ustaad Bhagat Singh

ఈ మధ్య హీరోయిన్ పూజ హెగ్డే టైమ్ అస్సలు బాగుండటం లేదు. అలవైకుంఠపురంలో సినిమా తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేకపోవటంతో పాటుగా పెద్దగా ఆఫర్లు లేకపోవటం, గుంటూరు కారం సినిమా రూపంలో ఉన్న ఒకే ఒక్క క్రేజీ ఆఫర్ కూడా చేజారిపోవటం పూజకి గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపంలో మరో షాక్ తగిలింది పూజా హెగ్డేకి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ కాకపోయినప్పటికీ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్లో కనిపించనుందని చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. అయితే, ఇప్పుడు శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా ఉన్న ఈ సినిమాలో సాక్షి వైద్య సెకండ్ హీరోయిన్ గా ఎంటరావటంతో ఇక పూజా హెగ్డే క్యారెక్టర్ లేనట్లే అని స్పష్టం అయ్యింది.
ఆ రకంగా ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో ఉన్న ఒక్క హోప్ కూడా చేజారిపోయింది పూజకి. తన సినిమాల్లో రెగ్యులర్ గా ఛాన్స్ ఇచ్చే డైరెక్టర్స్ త్రివిక్రమ్, హరీష్ శంకర్ లు తమ సినిమాల నుండి తప్పించటంతో పూజ పరిస్థితి అయోమయంలో పడ్డట్టయ్యింది. ప్రస్తుతం చెప్పుకోదగ్గ ఆఫర్లు లేని పూజకి టైర్2 హీరోల సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ ప్రపోజల్స్ వరుసగా వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.
ఒకరకంగా టైర్2 హీరోల సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ రావటం అన్నది పూజా హెగ్డేకి మంచిదనే చెప్పాలి. టైర్2 హీరోల సినిమాల్లో హీరోయిన్స్ కి పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికి కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకే పరిమితం అయిన పూజకి టైర్2 హీరోల సినిమాల రూపంలో తనని తాను ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కుతుందని చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు