PSPK’s Ustaad Bhagat Singh: ఉస్తాద్ లో బ్రో ని మించిన సెటైర్స్ ఉంటాయా..?

PSPK’s Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ వరుసగా సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన బ్రో సినిమా ఇటీవలే రిలీజ్ అవ్వగా, సుజిత్ డైరెక్షన్లో నటిస్తున్న ఓజి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, అప్పుడెప్పుడో మొదలైన హరిహర వీరమల్లు, ఆ తర్వాత మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ కి మాత్రం బ్రేక్ పడింది. హరిహర వీరమల్లు సినిమా ఆల్మోస్ట్ అటకెక్కిందన్న టాక్ వినిపిస్తుండగా, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం అందుతోంది. అయితే, హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ ఒక కండిషన్ పెట్టారని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పొలిటికల్ పంచ్ లు, సెటైర్లు ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే, ఇటీవల రిలీజ్ అయిన బ్రో సినిమాలో ఒకటి రెండు పొలిటికల్ సెటైర్లు ఉన్నందుకే ఏపీలో రాజకీయ దుమారం రేగింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా పొలిటికల్ టచ్ ఉంటుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచుకుంటున్నారు.

హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో కూడా పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి, ఇప్పుడు ఎలక్షన్ సమయంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా అదే రేంజ్ లో పంచ్ లు, సెటైర్లు ఉంటే ఏ రేంజ్ లో రచ్చ జరుగుతుందో చెప్పలేం. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఉన్న నేపథ్యంలో ఎలక్షన్స్ కి ముందే ఈ సినిమా రిలీజ్ చేయాలని పవన్ భావిస్తున్నాడట. మరి, అన్నీ సవ్యంగా సాగితే, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ పూర్తయ్యి అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు