Anasuya: రాజకీయాల్లోకి అనసూయ..? అందనంత స్థాయికి వెళ్ళిపోతుందట..!

Anasuya

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తన అంద చందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగువారిని అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం యాంకరింగ్ ఆపేసిన అనసూయ వరుసగా సినిమాలను చేస్తోంది. అయితే ఈమె నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ మధ్య ఈమె ఏడుస్తూ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ఈ క్రమంలో మళ్లీ అనసూయకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అనసూయ జాతకం పై వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అనసూయ జాతకం చాలా అద్భుతంగా ఉందని.. ఆమె వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా లేదని అన్నారు వేణు స్వామి. రానున్న రోజుల్లో అనసూయ మరింత హైపోజిషన్ కి వెళుతుందని తెలిపారు. అంతేకాదు అనసూయ జాతకం ప్రకారం త్వరలోనే రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని చెప్పుకొచ్చారు.

ఆ తరువాత పెద్ద పెద్ద పదవులు కూడా వరిస్తాయట. గతంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. నిజానికి వేణు స్వామి చెప్పినట్లుగానే 2021 తరువాత అనసూయ క్రేజ్ బాగా పెరిగింది. కాబట్టి ఆయన చెప్పినట్లుగానే అనసూయ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఈమధ్య విమానం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు