Love Me : ‘లవ్ మీ’ మూవీ బిజినెస్& బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Love Me : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న క్రేజీ సినిమాల్లో “లవ్ మీ” ఒకటి. నిజం చెప్పాలంటే ఈ ఒక్క సినిమాకే మినిమం బజ్ ఉంది. ఎందుకంటే గత రెండు నెలలుగా ఎన్నికల హడావిడి, ఇంకా ఐపీఎల్ సీజన్, మరియు సమ్మర్ ఎండల కారణంగా సరైన సినిమాలు రాకపోగా, వచ్చిన కొన్ని సినిమాలు కూడా దారుణంగా పరాజయం పాలయ్యాయి. ఇంకా చెప్పాలంటే రెండు వారాలుగా ఒక్క తెలుగు సినిమాలు సరైనవి లేక థియేటర్లు మూతబడ్డాయి. ఇక ఎన్నికలు ముగియగా, ఐపీఎల్ కూడా ఎండింగ్ దశకి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఎండలు చల్లబడుతున్నాయ్. అందువల్ల ఈ వారం నుండే థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇక ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ ముందుకు వస్తున్న మూవీస్ లో కొంచం నోటబుల్ అండ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న మూవీ “లవ్ మీ” (Love Me) . టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ యూనిక్ గా ఆకట్టుకోగా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మే 25న థియేటర్లలో భారీ ఎత్తుగానే రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది.

Love Me movie business &break even target

డీసెంట్ బిజినెస్ చేసిన లవ్ మీ..

ఇక లవ్ మీ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా దాదాపు 600 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక సినిమాను మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో మేజర్ ఏరియాల్లో ఓన్ గానే రిలీజ్ చేస్తూ ఉండగా, కొన్ని చోట్ల చిన్న చిన్న అడ్వాన్స్ లతో రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్ గా సినిమా ఓన్ రిలీజ్ వాల్యూ తో కలిపి మొత్తం మీద తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ రేంజ్ 4.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. ఇక వరల్డ్ వైడ్ గా బిజినెస్ రేంజ్ 5.5 కోట్ల దాకా ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఓవరాల్ గా సినిమా రిలీజ్ అండ్ వాల్యూ బిజినెస్ రేంజ్ ను బట్టి వరల్డ్ వైడ్ గా సినిమా మినిమమ్ 6 కోట్లు ఆ పైన కలెక్షన్స్ ని కనుక సాధిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అవుతుంది అని చెప్పొచ్చు.

- Advertisement -

ఓ మోస్తరు టాక్ వచ్చినా హిట్ అయ్యే ఛాన్స్…

ఇక దిల్ రాజు సినిమా కాబట్టి ఈ సినిమాకి మినిమం ప్రమోషన్లు జరగగా, మొత్తం మీద లవ్ మీ సినిమా ట్రైలర్ బాగానే ఆకట్టుకునేలా ఉండటంతో సినిమా కూడా రిలీజ్ అయిన తర్వాత, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను కనుక సొంతం చేసుకుంటే సినిమా (Love Me) మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రజెంట్ మార్కెట్ చాలా డ్రై గా ఉన్న టైంలో IPL మ్యాచులు అయిపోతాయి, కాబట్టి సినిమాకి టాక్ బాగుంటే ఎంతో కొంత జనాలను థియేటర్స్ కి రప్పించే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఆల్మోస్ట్ తక్కువే బిజినెస్ జరగడంతో టాక్ బాగుంటే ఈజీ గా తొలివారమే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. అన్నిటికి మించి దిల్ రాజు ఓన్ రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి, అన్ని కుదిరి మంచి టాక్ తో బ్రేక్ ఈవెన్ అయ్యి, మీద ఏమొచ్చినా తనకే లాభం. పైగా రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ ప్లాప్ తో భారీగా నష్టపోయిన దిల్ రాజు ఈ సినిమాతో హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు