Laya: నేను టీ అమ్ముకుని బతుకుతున్నానని.. దారుణంగా రాశారు

Laya: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్స్ లో లయ ఒకరు. స్వయంవరం అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ ఇచ్చింది లయ. అయితే ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు కూడా చేసింది లయ. అయితే లయ కెరియర్ లో పేరు తీసుకొచ్చి సినిమా అంటే మాత్రం అందరికీ గుర్తొచ్చేది స్వయంవరం. ఆ తరువాత ప్రేమించు, నీ ప్రేమకై, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాల్లో కూడా ప్రత్యేకమైన పేరు సాధించుకుంది.
తరుణ్ హీరోగా వచ్చిన నువ్వు లేక నేను లేను సినిమా కూడా మంచి పేరుని తీసుకొచ్చింది.

Laya

తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ

ప్రస్తుతం చాలామంది సీనియర్ హీరోయిన్లు కనిపించడం మానేశారు. లయ కూడా రీసెంట్ టైమ్స్ లో సినిమా అవకాశాలు తక్కువగా వచ్చాయి. ఇకపోతే లయ సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న సినిమా తమ్ముడు ఇదే పేరుతో ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అయింది ఇప్పుడు అదే టైటిల్ తో నితిన్ సినిమాను చేస్తున్నాడు స్వతహాగా నితిన్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద ఫ్యాన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ సినిమాలో లయన్ నితిన్ కి అక్కగా కనిపించడం లేదు ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని లయ తన గురించి వచ్చిన కథనాలపై రెస్పాండ్ అయింది

- Advertisement -

కథనాలపై రెస్పాండ్

నేను పెళ్లి చేసుకుని 2007లో అమెరికాకు వెళ్లిపోయాను. కుటుంబం, పిల్లల కోసం సమయం కేటాయించాలని సినిమాలకు దూరం అయ్యాను. పిల్లలు పెరిగే సమయంలో వారితోనే ఉండాలని నిర్ణయించుకున్నా. ఐతే నేను మీడియాకు దూరంగా ఉన్న టైంలో ఏదేదో రాశారు. మనం రోజూ కనిపిస్తూ ఉంటే మన గురించి వచ్చే వార్తలను జనం నమ్మరు. కానీ సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగా ఉండడంతో రకరకాల వార్తలు రాశారు. నా ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదని, నేను టీ అమ్ముకుని బతుకుతున్నానని.. ఇలా దారుణంగా రాశారు. అంటూ చెబుతూ బాధపడింది లయ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు