Sukumar: నా చిట్టి తల్లిని చూస్తుంటే గర్వంగా ఉంది

Sukumar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ దర్శకులలో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో దర్శకుడుగా పరిచయమైన సుకుమార్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకున్నారు. అందరూ దర్శకులులా కాకుండా తను డిఫరెంట్ గా సినిమాలు తీయడం మొదలుపెట్టారు. కొన్ని విషయాల్లో సుకుమార్ ఎంత తెలివిగా వ్యవహరిస్తారో, అంతే తెలివిగా సుకుమార్ సినిమాల్లో హీరోలు కూడా ఉంటారు. అయితే ప్రస్తుతం పుష్ప సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపును సాధించారు సుకుమార్.

Sukumar initially wanted to make film on red sanders smuggling with  Mahesh-Telangana Today

పుష్ప సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తక్కువ ఏమి కాదు. ఇక సుకుమార్ వ్యక్తిగత జీవితానికి వస్తే సుకుమార్ గారు తభిత గారిని మ్యారేజ్ చేసుకున్నారు. మీరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వీళ్ళకి సుకృతి వేణి అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమెకి ఉత్తమ బాలనటిగా దాదాసాహెబ్ అవార్డును కూడా అందుకున్నారు. అయితే గాంధీ తాత చెట్టు అనే సినిమాకి ఈ అవార్డు ఆవిడకి దక్కింది. ఇకపోతే సుకృతి మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు కేవలం యాక్టర్ గానే కాకుండా సింగర్ గా కూడా రాణిస్తున్నారు.

- Advertisement -

రీసెంట్ గా ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లో సుకృతి ఒక పాటను పాడింది. ఆ పాటను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఆ వీడియోని పంచుకుంటూ నా చిట్టి తల్లిని చూస్తుంటే గర్వంగా ఉందంటూ సుకుమార్ పోస్ట్ చేశారు. అయితే సుకృతి పాడిన ఆ యూట్యూబ్ లింక్ ను కూడా ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం శుకృతి పాడిన పాట చాలామందిని అలరిస్తుంది. ఇకపోతే సుకుమార్ లోని టాలెంట్ సుకృతి పాపా కూడా వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు