Samantha: విడాకులు తీసుకోకముందు నాగచైతన్యకు తెలియకుండా సమంత ఆ పనులు ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. సమంత నటించిన మొదటి సినిమాతోనే వరుసగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది. స్టార్ హీరోలు అందరి సరసన నటించి కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో తన హవాను కొనసాగించింది.

ఈ క్రమంలోనే సమంత సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరూ దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులకు గల కారణాలు ఇప్పటివరకు తెలియ రాలేదు. విడాకులు అనంతరం సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సమంత, నాగచైతన్య కలిసి ఉన్న సమయంలో నాగచైతన్యకు ఇష్టం లేని పని సమంత చేసిందట. ఆ పని మరి ఏదో కాదు సమంతకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం ఉండేదట. ఆ ఇష్టంతోనే సమంత చాక్లెట్స్ విపరీతంగా తినేదట. కానీ నాగచైతన్యకు చాక్లెట్స్ తినడం అస్సలు నచ్చేది కాదట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా…. విడాకుల అనంతరం సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఓవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు సమంత సినిమాలలో నటించింది. బాలీవుడ్ లో కూడా సినిమాల్లో రాణిస్తోంది. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలలో నటించినప్పటికి ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. విడాకుల అనంతరం నాగచైతన్యకు ఒక్క హిట్ కూడా తన ఖాతాలో పడలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు