OTT Movie : వయసొచ్చిన అమ్మాయిల వింత మరణాలు… వెన్నులో వణుకు పుట్టించే మూవీ

OTT Movie : ప్రస్తుతం ఓటీటీలో సస్పెన్స్ హారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇక ఓటిటి మూవీ లవర్స్ ప్రత్యేకంగా అలాంటి సినిమాలను వెతుక్కుని మరీ చూస్తున్నారు. ఆ డిమాండ్ చూసి ఓటిటి సంస్థలు కూడా సజెషన్స్ లో మంచి మంచి సస్పెన్స్ క్రైమ్ సినిమాలను లిస్ట్ చేస్తున్నాయి. అలాంటి జానర్లోని ఓ మూవీ ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సినిమాలో పెద్ద స్టార్స్ లేకపోవడంతో జనాల కంటికి పెద్దగా ఆనట్లేదు. కానీ ఈ మూవీ కథ, కథనం, ట్విస్టుల పరంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే వారికి ఇదొక మెంటలెక్కించే ఛాలెంజింగ్ మూవీ అవుతుంది. ఎందుకంటే అందులో వచ్చే ఒక్కో ట్విస్ట్ ను ఊహించడం కూడా కష్టమే మరి. వర్త్ వర్మ అనిపించే ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలను తెలుసుకుందాం.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న క్రేజీ మూవీ పేరు కలియుగ పట్టణంలో. వినడానికి టైటిల్ విచిత్రంగా ఉన్నప్పటికీ స్టోరీ దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అయితే వయసు వచ్చిన అమ్మాయిలు వరుసగా వింతగా మరణించడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మేకర్స్ టైటిల్ కు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న కలి యుగంలోని జనాలు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి ? అనే విషయాలకు వైలెన్స్, క్రైమ్ యాడ్ చేసి ఆసక్తికరంగా చూపించారు. సినిమాలో వచ్చే ఒక్కో ట్విస్ట్ ను ఊహించడం చాలా కష్టం. మనం అనుకున్నది ఒక్కటైతే అక్కడ వచ్చే టెస్ట్ మరొకటి అవుతుంది. ఇక ఈ వింత కాన్సెప్ట్ స్టోరీ ఏంటి అంటే…

Kaliyugam Pattanamlo: ఆలోచింపజేసేలా చంద్రబోస్ సాహిత్యం.. 'కలియుగం పట్టణంలో'  టైటిల్ సాంగ్ విడుద‌ల‌ | Kaliyugam Pattanamlo Movie Chandrabose Title song  Out ktr

- Advertisement -

మూవీ స్టోరీ ఇదే…

కలియుగ పట్టణంలో మూవీ స్టోరీ ఒక ఊరిలో జరిగే కొన్ని వింత మరణాల గురించి నడుస్తుంది. ముఖ్యంగా వయసుకు వచ్చిన అమ్మాయిలే వరుసగా అనుమానాస్పదంగా మరణించడం అక్కడి జనాలతో పాటు ప్రభుత్వాన్ని కూడా కలవర పెడుతుంది. అసలు ఏం జరుగుతుందో ఒక్కరికి కూడా అంతుపట్టదు. ఈ కేసును పోలీసులు కూడా చేదించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకు అసలు ఎలాంటి క్లూ దొరకదు.  అసలు అమ్మాయిల మరణాలు సహజంగా జరుగుతున్నాయా ? లేదంటే ఆత్మహత్యలా ? ఎవరైనా సైకో కిల్లర్ ఇలా చంపుతున్నాడా ? అనే విషయం ఓ పట్టాన అంతు పట్టదు.

ఈ నేపథ్యంలోనే మరోవైపు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. అయితే చివరికి హీరోయిన్ కి కూడా అలాంటి క్షణం రానే వస్తుంది. మరి హీరో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? చివరకు ఈ మూవీ కథ ఎలాంటి మనకు తిరిగింది ? హత్యలపై సస్పెన్స్ వీడిందా ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న కలియుగ పట్టణంలో మూవీని చూడాల్సిందే. మూవీలో కేవలం క్రైమ్ మాత్రమే కాదు తల్లి కొడుకుల సెంటిమెంట్, తండ్రి కొడుకులు సెంటిమెంట్, లవ్ పంటి అన్ని రకాల ఎమోషన్స్ కలగలిపి ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు