OTT Movie : ఎదురింట్లో జరిగే ఇంటిమేట్ సీన్స్ చూసే భార్యాభర్తలు… చివరికి ఆమె భర్త, అతని భార్య…

OTT Movie : వీకెండ్ రానే వచ్చేసింది. ఓటిటిలో కొత్తగా ఏఏ సినిమాలు వస్తున్నాయి? ఈ వీకెండ్ ఏ మూవీని చూడొచ్చు అంటూ ఇప్పటి నుంచే తెగ సర్చ్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఒకవేళ ఆల్రెడీ ఓటీడీలో ఉన్న మంచి సినిమాలను చూడాలి అనుకునే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఈవారం ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ బో*ల్డ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ పై లుొక్కేయండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ది వోయర్స్. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రిమింగ్ అవుతోంది. ఒకవేళ ఇప్పటిదాకా బో*ల్డ్ మూవీ లవర్స్ ఈ సినిమాను చూసి ఉండకపోతే తప్పకుండా ఈ వీకెండ్ చూడండి. మూవీ చూశాక వర్త్ వాచింగ్ అని మీరే అంటారు.

The voyeurs: film summary and ending explained - It's sensational but not  moral enough.[Pulse Contributor Opinion] | Pulse Nigeria

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే ?

పిప్పా, థామస్ అనే ఇద్దరూ భార్య భర్తలు. ఈ జంట కొత్తగా ఓ అపార్ట్మెంట్లోకి అడుగుపెడుతుంది. అయితే అదే బిల్డింగ్లో వారి ఫ్లాట్ కు ఎదురుగా ఉన్న మరొక ఫ్లాట్ లో ఇంకో జంట ఉంటుంది. అయితే వాళ్లు ఉండేది ఎదురింట్లోనే అయినప్పటికీ పిప్పా వాళ్లకు తమ ఇంట్లో నుంచి చూస్తే అవతలి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మొత్తం కనిపిస్తుంది. ఎదురింట్లో ఉండే ఆ అమ్మాయి భర్త ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఇంట్లోనే మోడల్స్ ను ఫోటోలు తీయడం, వారితో ఇంటిమేట్ అవ్వడం వంటివి చేస్తూ ఉంటాడు. పిప్పా ఇదంతా చూస్తూనే ఉంటుంది. అయితే ఆమె భర్త మాత్రం ఎదురు ఇంట్లోకి అలా తొంగి చూడడం తప్పు అని చెప్తూ ఉంటాడు. అయినప్పటికీ పిప్పా అతని మాటను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతిరోజు ఆ ఫోటోగ్రాఫర్ ఇంట్లో జరిగే అన్ని విషయాలను చూస్తూ ఉంటుంది.

ఇక ఒకానొక సమయంలో ఫోటోగ్రాఫర్ తన భార్యకు అన్యాయం చేస్తున్నాడు అని ఫీల్ అయ్యి, ఆమెకు ఎలాగైనా విషయాన్ని చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అనుకున్నట్టుగానే ఓ రోజు ఫోటోగ్రాఫర్ భార్యను బయట ఎక్కడో కలిసి అసలు విషయం చెప్పేస్తుంది. కానీ తీరా చూస్తే ఫోటోగ్రాఫర్ భార్య సూసైడ్ చేసుకుని చనిపోయి పిప్పాకు షాక్ ఇస్తుంది. ఈ విషయం తెలిసిన పిప్పా భర్త ఆ ఫోటోగ్రాఫర్ భార్య చనిపోవడానికి తన భార్య కారణం అని భావించి కోపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. అయితే ఆ తర్వాత ఓ రోజు పబ్ లో ఆ ఫోటోగ్రాఫర్, పిప్పా కలవడం, తను ఎంతమందితో ఉన్నా కూడా భార్య అంటే పిచ్చి ప్రేమ అంటూ ఫోటోగ్రాఫర్ బాధపడడం జరుగుతాయి. పిప్పా కూడా ఎమోషనల్ అవుతుంది. చివరకు పిప్పా ఫోటోగ్రాఫర్ ఇద్దరూ ఫోటోల పేరుతో ఇంటికి వెళ్ళి రొమాన్స్ చేస్తారు. వాళ్ళని అలా చూసిన పిప్పా భర్త థామస్ ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. మరి అసలు ఆ ఫోటోగ్రాఫర్ ఎవరు? అతని భార్య ఎందుకు చనిపోయింది? చివరకు పిప్పా పరిస్థితి ఏమైంది ? అనే విషయాలు తెలియాలంటే ఈ వీకెండ్ ఈ మూవీపై ఓ లుక్కెయ్యండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు