Love Me Movie OTT : బేబీ హీరోయిన్ కొత్త సినిమా ఏ ఓటిటిలోకి రాబోతోందో తెలుసా?

Love Me Movie OTT : బేబీ సినిమాతో ఫుల్ పాపులర్ అయిపోయింది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంతో ఈ బ్యూటీ నెక్స్ట్ మూవీ గురించి ప్రేక్షకులుగా ఈగర్ గా  వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ మూవీ లవర్స్ కి ట్రీట్ ఇవ్వడానికి లవ్ మీ మూవీతో మరికొన్ని గంటలోనే థియేటర్లలోకి రాబోతోంది వైష్ణవి చైతన్య. ఈ నేపథ్యంలో లవ్ మీ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది? అనే చర్చ మొదలైంది. మరి ఈ హారర్ మూవీ డిజిటల్ స్ట్రిమింగ్ రైట్స్ ను ఏ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది? అనే వివరాల్లోకి వెళితే…

మరికొన్ని గంటలో లవ్ మీ రిలీజ్…

ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన హారర్ మూవీ లవ్ మీ. ఈ మూవీకి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించగా, ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ మూవీ మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ మూవీతో వైష్ణవి చైతన్య మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందా? ఆశిష్ కు హిట్ ఇస్తుందా? అనే ఆసక్తి నెలకొంది.

Love Me Movie: వైష్ణ‌వి చైత‌న్య హార‌ర్ ల‌వ్‌స్టోరీ రిలీజ్ వాయిదా - నెల  రోజులు ఆల‌స్యంగా థియేట‌ర్ల‌లోకి ల‌వ్ మీ మూవీ-tollywood news vaishnavi  chaitanya love me if you dare ...

- Advertisement -

ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది ?

లవ్ మీ మూవీ ఇంకా థియేటర్లోకి కూడా రాకముందే డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ కన్ఫర్మ్ అవ్వడం విశేషం. ఈ మూవీ ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఓటిటి రిలీజ్ డేట్ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సాధారణంగా సినిమాలు థియేటర్లలోకి వచ్చిన 45 రోజులకు ఓటీటీలో రిలీజ్ అవుతాయి. లేదా నెల రోజుల లోపే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చి థియేటర్లలో ఆడితే మాత్రం ఓటీటీ స్ట్రీమింగ్ మరింత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం అస్సలు పోటీ అనేదే లేకుండా వస్తున్న లవ్ మీ మూవీకి థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

లవ్ మీ మూవీ స్టోరీ…

ఇప్పటికే రిలీజ్ అయిన లవ్ మీ ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీని పెంచేసింది. హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ సరికొత్త కథతో రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది. ట్రైలర్ ను బట్టి చూస్తే ఇందులో హీరో ఏకంగా దయ్యాన్నె ప్రేమిస్తాడని తెలుస్తోంది. దయ్యాన్ని వెతుక్కుంటూ వెళ్లే హీరో భయ మేసే చోట రొమాన్స్ బాగుంటుందంటూ ఎగ్జైటింగ్ గా ఓ భవనంలోకి ఎంటర్ అవ్వడం ట్రైలర్ లో కనిపించింది. నిజానికి ఆ దయ్యం ఎవరైనా కంటపడితే చాలు చంపేస్తుందని హీరోయిన్ చెప్పినప్పటికీ అతను వినడు. ఆ దయ్యాన్ని ఎలాగినా చూడాలనుకొని, దాని ప్రేమలో పడేయాలని అనుకోవడం కొత్తగానే ఉంది. మరి హీరో ఎందుకు దెయ్యాన్ని ప్రేమించాలి అనుకుంటాడు? ఆ దయ్యం స్టోరీ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న లవ్ మీ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు