Burning Bridges : తెలుగు డాక్యుమెంటరీ కి ప్రఖ్యాత ‘దాదాసాహెబ్ పాల్కే’ అవార్డు..

Burning Bridges : ఈ మధ్య ఇండియాలో డాక్యూమెంటరీల హవా పెరిగిపోయింది. సినిమాలతో ఈక్వెల్ గా వీటికి ప్రాధాన్యత పెరిగిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ తమిళ్ లో తీసిన ఓ డాక్యుమెంటరీ కి ఏకంగా ఇంటర్నేషనల్ అవార్డులు రావడం చూసే ఉంటాం. నిజానికి డాక్యుమెంటరీ లకు ఇంత ప్రాధాన్యత రావడానికి అప్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా, అలాగే నిజ జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కినవి కాబట్టి, కథా, కథనాలు మరింత బలంగా ఉంటాయి. ఇక కథలైనా, సినిమాలైన మనకు ఎదురైన, చూసిన పరిస్థితుల నుంచే పుడతాయని తెలిసిందే. తాజాగా ‘బర్నింగ్ బ్రిడ్జెస్’ డాక్యుమెంటరీ కూడా అలా పుట్టిందే. దర్శకుడు ఫణీంద్ర అడపాల ఓ రోజు వెళ్తూ వెళ్తూ అనుకోకుండా అగ్నిమాపక కేంద్రాన్ని చూసి, అక్కడ ఉన్న సిబ్బంది గురించి ఆలోచించారు. రకరకాల ప్రమాదాలను చూసినప్పుడు వారు ఎలాంటి భావోద్వేగాలకు గురయ్యారో తెలుసుకోవాలని భావించారు. అలా ఈ డాక్యుమెంటరీ తెరకెక్కడం జరిగింది.

burning bridges documentary Wins dadasaheb phalke award

‘బర్నింగ్ బ్రిడ్జెస్’ తీయాలని అనుకుంది అప్పుడే!

ఇక డైరెక్టర్ ఫణీంద్ర ఓ రోజు హైటెక్ సిటీ నుంచి సైనిక్‌పురికి ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా సికింద్రాబాద్ అగ్నిమాపక కేంద్రాన్ని చూశారు. ఆ తర్వాత ఒక కేఫ్‌లో, ప్రజలు అగ్నిప్రమాదం గురించి మాట్లాడుకోవడాన్ని గమనించారు. అదే సమయంలో పలు పత్రికలలో వచ్చిన వార్తాలను చూశాడు. ఇవన్నీ గమనించిన అతడికి అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన జీవితాలను, వారికి ఎదురైన అనుభవాలను తెలుసుకోవాలని భావించారు. పనిలో పనిగా ఓ డాక్యుమెంటరీని రూపొందించాలని అనుకున్నారు. ఇక ‘బర్నింగ్ బ్రిడ్జెస్’ డాక్యుమెంటరీ కోసం ఫణీంద్ర ముందుగా తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ (ఫైర్) వై.నాగిరెడ్డి పర్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ప్యారడైజ్, మాదాపూర్ , జీడిమెట్ల లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బందిని ఇంటర్వ్యూ చేశారు. “ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో అగ్ని మాపక సిబ్బంది చెప్పిన మాటలు విని కన్నీళ్లు వచ్చాయి. అగ్ని ప్రమాదంలో తల్లీ కొడుకు చనిపోయిన ఘటన, ఓ యువ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన, ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న చిన్నారులు, అగ్ని ప్రమాద సమయంలో స్థానికుల నుంచి ఎదురైన ఇబ్బందులు చెప్తుంటే భావోద్వేగానికి గురయ్యానని డైరెక్టర్ అన్నాడు. నిజంగా ఫైర్ సిబ్బంది తెగింపు ఎంతో గొప్పదని, వారిని తప్పకుండా గౌరవించాలని ఫణీంద్ర తెలిపారు.

- Advertisement -

‘బర్నింగ్ బ్రిడ్జెస్ కి దాదాసాహెబ్ పాల్కే అవార్డు..

ఇక ‘బర్నింగ్ బ్రిడ్జెస్’ (Burning Bridges) డాక్యుమెంటరీ ని దర్శకుడు ఫణింద్ర ఎంతో గొప్పగా తెరకెక్కించాడు. అగ్నిమాపక సిబ్బందికి ఎదురైన పరిస్థితులను, అనుభవించిన బాధను దృశ్యరూపంగా మార్చారు. 55 నిమిషాల నిడివితో ఈ డాక్యుమెంటరీ ఉంటుంది. అయితే తాజాగా ‘బర్నింగ్ బ్రిడ్జెస్’ డాక్యుమెంటరీ కి 14వ దాదా సాహబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ (DSPFF-24) లో జ్యూరీ అవార్డు లభించింది. జూన్‌లో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ హౌస్ (IFH) జాతీయ అవార్డులలో రెండు విభాగాల్లో ‘బర్నింగ్ బ్రిడ్జెస్’ విజేతగా నిలిచింది.

ఇక దర్శకుడు ఫణీంద్ర నిర్మలా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను రన్ చేస్తున్నారు. కార్పొరేట్ ఫిల్మ్స్, షోలు, ప్రోడక్ట్ షూట్లతో పాటు సోషల్ మీడియా మేనేజ్‌మెంట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అతను త్వరలో ‘1981లో ఇంద్రవెల్లి’ అనే సినిమా తెరకెక్కించబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగిస్తున్నారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు