Satyabhama: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టిన కాజల్

Satyabhama: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ అంటే కాజల్ పేరు వినిపించేది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈవిడ అతి తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది. మగధీర సినిమాతో మంచి పేరును సాధించుకున్న కాజల్ ఆ తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. ఇకపోతే రీసెంట్ గా గౌతమ్ అని ఒక బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకుంది కాజల్. అప్పటితో సినిమాలకు కొంచెం గ్యాప్ ఇస్తూ వచ్చింది.

Kajal Aggarwal

రీసెంట్ గా మళ్లీ సత్యభామ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచుతుంది అని చెప్పొచ్చు. రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో పోలీస్ ఆఫీస్ పాత్రలో కాజల్ కనిపిస్తుంది. ఒకప్పుడు విజయశాంతి సినిమాలు ఎంత పవర్ ఫుల్ గా అనిపించేవో ఆ స్థాయిలో ఉంది సత్యభామ ట్రైలర్.

- Advertisement -

సత్యభామ సినిమాలో పవర్ ఫుల్ రోల్ ను కాజల్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు కూడా అద్భుతంగా ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. అయితే ఈ సత్యభామ ట్రైలర్ సినిమా పైన మంచి అంచనాలను పెంచుతుంది. నవీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో కనిపిస్తున్నారు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు. ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నెక్స్ట్ మంత్ ఏడవ తారీఖున రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు