Bhaje Vayuvegam : సాలిడ్ డిజిటల్ బిజినెస్ చేసిన చిన్న సినిమా!

Bhaje Vayuvegam : టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన కార్తికేయ ఫుల్ జోష్ లో ఉన్నాడు. కెరీర్ బిగినింగ్ లో మంచి సక్సెస్ లు అందుకున్న ఈ హీరో ఆ తర్వాత వరుస ప్లాప్ లతో డీలా పడ్డాడు. మధ్యలో ఇతర స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గానూ నటించాడు. అయితే ఈ హీరోకి గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక డీలా పడ్డ సమయంలో బెదురులంక గాడిలో పడేసింది. లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ బెదురులంక 2012 సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న RX100 హీరో కార్తికేయ, ఆ సినిమా తర్వాత చేస్తున్న కొత్త సినిమా “భజే వాయువు వేగం” (Bhaje VaayuVegam) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ నెల ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతుంది. ఇక ఈ సినిమా తో పాటు రిలీజ్ అవుతున్న పలు సినిమాలు పోటీ పడనున్నాయి. ఈ సినిమాకి పోటిలో మరో 2 నోటబుల్ మూవీస్ ఉండగా, ఓవరాల్ గా పేరుకు చిన్న సినిమాలానే అనిపించినా కూడా ఆల్ రెడీ బిజినెస్ డీల్స్ బాగానే సొంతం చేసుకుంటుంది భజే వాయువేగం. తాజాగా డిజిటల్ రేట్లలో, అలాగే ఓటిటి పరంగా మంచి రేటును సొంతం చేసుకుంది కార్తికేయ సినిమా.

Bhaje Vayuvegam movie Non Theatrical business details

మంచి రేటుకు నాన్ థియేట్రికల్ బిజినెస్..

క కార్తికేయ నటించిన భజే వాయువేగం సినిమా రీసెంట్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ ను పూర్తి చేసుకుంది. యువి క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్న ఈ సినిమా క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించగా, ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ తో ఆల్ మోస్ట్ బడ్జెట్ మొత్తం రికవరీ అయ్యింది అన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కింద ఆల్ మోస్ట్ 5 కోట్ల దాకా బిజినెస్ ను చేసిందట. ఇక OTT రైట్స్ కింద ఆల్ మోస్ట్ 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా, మ్యూజిక్ రైట్స్ ఇతర రైట్స్ అన్నీ కలిపి ఆల్ మోస్ట్ టోటల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ రేంజ్ 15.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో మేకర్స్ ఓన్ రిలీజ్…

ఇక భజేవాయువేగం (Bhaje Vayuvegam) సినిమాను తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో సినిమాను ఓన్ గానే మేకర్స్ రిలీజ్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమాకి థియేట్రికల్ రన్ లో వచ్చేవి టేబుల్ ప్రాఫిట్ ను తెచ్చిపెడతాయని అంటున్నారు. బెదురులంక సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కార్తికేయ ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో త్వరలో తేలనుంది. ఇక భజేవాయువేగం సినిమాని ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో హ్యాపీడేస్ టైసన్ ఫేమ్ రాహుల్ కీలక పాత్రలో ఎంట్రీ ఇస్తున్నాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు