Turbo : మలయాళంలో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న మమ్మూట్టి సినిమా!

Turbo : మలయాళంలో వరుస సినిమాలు ఈ మధ్య భారీ విజయాలు సాధిస్తున్నాయి. మొన్న మంజుమ్మేల్ బాయ్స్ తో మొదలు పెట్టి నిన్నటి ఆవేశం వరకు బ్లాక్ బస్టర్ హిట్లతో మలయాళ బాక్స్ ఆఫీస్ కళకళలాడుతుంది. పైగా ఈ ఒక్క ఏడాదిలోనే మళయాలంలో నాలుగు వంద కోట్ల సినిమాలు రాగా, రీసెంట్ గా రిలీజ్ అయిన పృత్వి రాజ్ సుకుమారన్ మరో సినిమా వంద కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇక మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి నుండి కూడా ఈ ఇయర్ సాలిడ్ కం బ్యాక్ సినిమా రాగా, తాజాగా మరో సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ ఏడాది మమ్మూట్టి “భ్రమయుగం” అనే ప్రయోగాత్మక సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో 60 కోట్ల వసూళ్ళని అందుకుంది. ఇక లేటెస్ట్ గా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ “టర్బో” (Turbo) రీసెంట్ గా రిలీజ్ అయి మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

Turbo movie first day collections

భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న టర్బో మూవీ..

ఇక మమ్మూట్టి నటించిన టర్బో మూవీ కి మలయాళంలో మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా మరీ ఓ రేంజ్ లో లేకపోయినా, కమర్షియల్ గా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా మీద సాలిడ్ హైప్ ఉండటంతో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను మొదటి రోజున సొంతం చేసుకోవడం జరిగింది. ఎంతలా అంటే మామూట్టి కెరీర్ లోనే టర్బో సినిమా హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తుంది. ఇక తాజాగా తొలిరోజు కేరళలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను మలయాళ మూవీస్ లో సొంతం చేసుకున్న ఈ సినిమాగా నిలవగా, వరల్డ్ వైడ్ గా మమ్ముట్టి కెరీర్ లో నంబర్ వన్ కలెక్షన్స్ ని సాధించింది. తొలిరోజు కేరళలో ఈ సినిమా 6.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా మొదటి రోజున మరో 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా, ఓవర్సీస్ లో ఏకంగా స్టేట్ కలెక్షన్లను మించి, సెన్సేషనల్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న సినిమా, అక్కడ 7.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

- Advertisement -

వంద కోట్లు రాబట్టే అవకాశం..

ఇక టర్బో (Turbo) మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 14.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మమ్మూట్టి కెరీర్ లోనే ఇది హైయెస్ట్. ఇక టాక్ ఎలా ఉన్నా కూడా వీకెండ్ లో సినిమా మలయాళ మార్కెట్ లో బాగా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు నెటిజన్లు. ఇక ఈ ఇయర్ భ్రమయుగం తో మంచి హిట్ అందుకున్న మమ్మూట్టి ఈ సినిమాతో మరో హిట్ ని సొంతం చేసుకొనే ఛాన్స్ ఉంది. ఇక టర్బో మూవీ మొదటి వారం గనుక 60 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించగలిగితే ఈ సినిమా కూడా వంద కోట్ల వసూళ్లు అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి టర్బో సినిమా ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు