Gangs Of Godavari : ప్రీ రిలీజ్ ఈవెంట్… మళ్లీ నందమూరి కుటుంబాన్నే నమ్ముకున్న విశ్వక్

Gangs Of Godavari : : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఈ ఏడాది ఫుల్ జోష్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ దాస్ కా ధమ్కీ సినిమాతో మంచి హిట్టు కొట్టిన మాస్ కా దాస్ ఈ ఇది కూడా ‘గామి’ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక కెరీర్ లో బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న విశ్వక్ సేన్ త్వరలోనే “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాతో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమాపై ముందునుండి క్రేజీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో పాటు, పాటలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో గ్యాంగ్స్ అఫ్ గోదావరి పై క్రేజీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బిజినెస్ కూడా జరిగింది. అయితే ఈ సినిమా గత మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. నిజానికి మార్చిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా, షూటింగ్ డిలే వల్ల వాయిదా పడిందని మేకర్స్ చెప్పుకొచ్చారు.

Balakrishna was the guest at the pre-release event of Gangs of Godavari

విశ్వక్ సేన్ కోసం బాలయ్య..

ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి (Gangs Of Godavari) సినిమా మే 31న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుండగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం గ్యాంగ్స్ అఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రానున్నారని సమాచారం. ఈ వేడుకని హైదరాబాద్ లోనే ఈ నెల 28 లేదా 29న నిర్వహించనున్నారని చిత్ర యూనిట్ నుండి సమాచారం వచ్చింది. ఇక ఈ సినిమాకి ఖచ్చితంగా నందమూరి హీరో గెస్ట్ గా వస్తారని చాలా రోజుల నుండి ప్రచారం జరుగుతుండగా అది నిజమేనని తెలిసింది.

- Advertisement -

నందమూరి కుటుంబాన్నే నమ్ముకున్న విశ్వక్..

ఇక విశ్వక్ సేన్ స్వతహాగా సొంతంగానే సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినా, ఇండస్ట్రీ కి వచ్చాక నందమూరి అభిమానిగా, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్పుకుంటున్నాడు. అయితే ఇదంతా ఈ మధ్య కాలంలోనే. ఇక ఎన్టీఆర్ గురించి అలాగే, బాలయ్య గురించి చాలా సార్లు చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్. వీళ్లిద్దరి చేత గతంలో కూడా కొన్ని సినిమాలకు ప్రమోట్ చేయించుకున్నాడు విశ్వక్ సేన్. లాస్ట్ ఇయర్ దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలిపించుకున్నాడు విశ్వక్. ఇక ఈ సారి కూడా నందమూరి కుటుంబాన్నే నమ్ముకున్నాడు. ఇప్పుడు గోదావరికి బాలయ్య ని గెస్ట్ గా పిలుస్తున్నాడు. ఇక ఆ మధ్య బాలయ్య అన్ స్టాపబుల్ షో కి కూడా విశ్వక్ సేన్ వెళ్లి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇక విశ్వక్ సేన్ కి నందమూరి అభిమానం కూడా బాగానే ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఆ మధ్య మెగాఅభిమానుల అండదండలు నితిన్ కి ఎలా దొరికాయో, ఇప్పుడు నందమూరి అభిమానుల సపోర్ట్ విశ్వక్ కి దొరుకుతుందని చెప్పొచ్చు. మరి గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో ఆడియన్స్ ని ఎలా అలరిస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు