Singer Sunitha : అందమైన చిరునవ్వుతో సొగసు చూడతరమా అనిపించేలా గాయని ‘ముఖారవిందం’..

Singer Sunitha : టాలీవుడ్ లో అద్భుతమైన ఫిమేల్ సింగ్స్ లో ఒకరు సునీత. దాదాపు పాతికేళ్లుగా తన అద్భుతమైన గాత్రంతో తెలుగు ప్రేక్షకులని అలరిస్తుంది సునీత. ఇక చూడ్డానికి కూడా హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కానీ విధంగా అందమైన మోముతో చూపరులను ఆకట్టుకుంటుంది సునీత. ఇక టాలీవుడ్ తెలుగు ప్రేక్షకులను తన అద్భుత గాత్రంతో అలరిస్తున్న సింగర్ సునీత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ.. మరింత బిజీగా మారుతోంది. ఇకపోతే ఈ మధ్యే రెండో పెళ్లి కూడా చేసుకున్న సునీత తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉండగా సునీత సింగర్ మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. కానీ తెర వెనుక మాత్రం తన గాత్రాన్ని ఎక్కువగా వినిపిస్తూ, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక కేవలం 15 సంవత్సరాల వయసులోనే సింగర్ గా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ, ఎన్నో చిత్రాలలో సూపర్ హిట్ సాంగ్స్ మనకు అందించి మంచి పేరు దక్కించుకుంది.

Singer Sunitha latest photoshoots viral on social media

డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ ఫేమస్..

ఇక సింగర్ సునీత (Singer Sunitha) డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చాలా సినిమాలు చేసింది. అప్పట్లోనే అనగా, తన కెరీర్ బిగినింగ్ డేస్ లోనే మెగాస్టార్ చిరంజీవి చూడాలని ఉంది లో సౌందర్య పాత్రకు డబ్బింగ్ చెప్పి అదరగొట్టింది. ఇక ఆ తర్వాత కూడా చాలా మంది హీరోయిన్లకు గాత్ర దానం చేసింది. ఒక్క సౌందర్య నుండి మొదలుపెడితే, స్నేహ, నయనతార, జ్యోతిక, సోనాలి బింద్రే, శ్రీయ శరన్, కమలిని ముఖర్జీ లాంటి హీరోయిన్లకు ఎంతో మందికి డబ్బింగ్ చెప్పి అలరించింది. అలా ఇప్పటివరకు దాదాపు 500 సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది సునీత. ఇప్పటికి కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంది. ఇక సింగర్ గా కూడా కొనసాగుతుంది. అయితే ఒకప్పటిలా మరీ బిజీగా కాకున్నా ఓ మోస్తరుగా పాటలు పాడుతుంది.

- Advertisement -

ఫోటోషూట్లలోనూ అద్భుతమే..

ఇక అప్పుడప్పుడూ ఫోటోషూట్లలో కూడా సునీత తన అందం, అభినయం తో అలరిస్తుంది. ఎక్కువగా చీరల్లో కనిపించే సునీత తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటోషూట్ చేయగా, బ్రౌన్ రంగు చీరలో అందంగా నవ్వుతూ ఫోజులిచ్చింది. ఇక ఎక్స్ పోజింగ్ లకు ఉండే ఈ సింగర్ తన, హావా భావాలతోనే ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా పోస్ట్ చేసిన ఫోటోషూట్ లో “అందమైన చిరునవ్వు అనేది ఎవరైనా కనుగొనగలిగే అందమైన ఆభరణం” అని ఇంగ్లీష్ లో కవిత్వం రాసి షేర్ చేసింది. ఇక ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సింగర్ సునీత విషయానికి వస్తే.. ఇటీవల రెండో పెళ్లి చేసుకోగా, తన కొడుకు ఆకాష్ ని ఈ ఏడాది హీరోగా కూడా పరిచయం చేసింది. కె. రాఘవేంద్ర రావు నిర్మాణంలో సర్కారు నౌకరి అనే సినిమాలో ఆకాష్ హీరోగా నటించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు