Deepika Padukone : సోషల్ మీడియాలో అయినా పట్టించుకోవట్లేదని ఆ హీరో ఫ్యాన్స్ నిరాశ..!

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసే తక్కువ మంది హీరోయిన్లలో ఈమె ముందుంటుంది. పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి తరవాత కూడా దీపికా వరుస సినిమాలతో బిజీ గా ఉండడం విశేషం. ఇదిలా ఉండగా దీపికా పదుకొనె ఈ ఇయర్ “కల్కి2898ఏడీ” సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ గా అడుగుపెడుతోన్న విషయం తెలిసిందే. ఇక దీపికా పదుకోన్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా అని చెప్పొచ్చు. ఇక కల్కి ని పాన్ వరల్డ్ రేంజ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ సిద్ధం చేస్తున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీగా కల్కి 2898AD రెడీ అవుతుంది. ఇక జూన్ 27న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో కల్కి మూవీ ఉండబోతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాగా, ప్రమోషన్లు వారం కిందట అఫిషియల్ గా మొదలయ్యాయని తెలిసిందే.

Prabhas fans angry with Deepika Padukone

ప్రమోషన్లకు రాకపోయినా సోషల్ మీడియాలో పట్టించుకోవాలిగా!

ఇక రీసెంట్ గా “బుజ్జి విత్ భైరవ” గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీనిని చిత్ర యూనిట్ అందరూ వారి వారి సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ప్రమోట్ చేస్తున్నారు. అయితే మెయిన్ ఫిమేల్ లీడ్ అయిన దీపికా పదుకునే మాత్రం కల్కి డిజిటల్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం లేదు. దిశా పటాని, అమితాబచ్చన్ లాంటి స్టార్స్ కూడా గ్లింప్స్ ని షేర్ చేయడంతో పాటు మూవీ విశేషాలు ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. కానీ దీపికా పదుకునే మాత్రం షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కల్కి సినిమా గురించి తన ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా పోస్ట్ లు చేయడం లేదంట. రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ ని కూడా కనీసం షేర్ చేయలేదు. దీనిపై ప్రభాస్ అభిమానులు గుర్రుగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎంత పెద్ద స్టార్ అయిన కూడా సినిమాని ప్రమోట్ చేయకపోవడం కరెక్ట్ కాదనే మాట వినిపిస్తోంది. తాను చివరిగా నటించిన లేడీ సింగం మూవీ స్టిల్స్ ని కూడా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. అలాగే ఆమె నుంచి చివరిగా థియేటర్స్ లోకి వచ్చిన ఫైటర్ మూవీని ఇన్ స్టాగ్రామ్ లో గట్టిగానే ప్రమోషన్ చేసింది. కల్కి 2898ఏడీ సినిమాలో నటించింది అని పేరుకే గాని ఒక పోస్టర్, గ్లింప్స్ కూడా ఆమె పేజీలోలో లేదని డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

కారణం ఇదే?

అయితే కల్కి2898AD  రిలీజ్ కి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా కూడా దీపికా పదుకునే (Deepika Padukone) కల్కి చిత్రం గురించి ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడంపై చిత్ర యూనిట్ కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. నిజానికి దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం దీపికా పదుకొనె గర్భవతిగా ఉండటంతో విశ్రాంతి తీసుకుంటుంది. ఈ కారణంగా ప్రమోషన్లకి దూరంగా ఉంది. కానీ ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం దీపిక యాక్టివ్ గానే ఉంది. అలాంటప్పుడు కాస్త ఒక పోస్ట్ లేదా, ట్వీట్ అయినా వేయాల్సిందని అభిమానులు అంటున్నారు. ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో చేస్తోన్న కూడా దీపికా కల్కి చిత్రాన్ని పట్టించుకోకపోవడానికి ఇంకా మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇక దీపికా ప్రస్తుతం ఐదో నెలలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే డెలివరీ తర్వాత ఏడాది కాలంపాటు సినిమాలకు దూరం కానున్నట్టు సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు