Tamanna Simhadri: హేమా బ్రతుకు అదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా..!

Tamanna Simhadri.. రేవ్ పార్టీ.. ఇప్పుడు ఎంతలా కలకలం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో జి ఆర్ ఫామ్ హౌస్ లో బర్తడే పేరిట రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే.. ఇక్కడ చాలామంది తెలుగు సినీ ప్రముఖులు ఇరుక్కున్నారు.. ముఖ్యంగా నటి హేమ అందులో పాల్గొనగా..తాను ఎక్కడికి వెళ్లలేదంటూ రిలీజ్ చేసిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఆ మరుసటి రోజు పోలీసులు నటి హేమ ఆ పార్టీలో ఉందంటూ ప్రకటించగా ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే హేమా పై ప్రముఖ సీనియర్ నటి కరాటే కళ్యాణి విరుచుకుపడుతూ.. హేమా అంటేనే ఒక ఫేక్ అంటూ సంచలన కామెంట్లు చేసింది.. ఇప్పుడు మరొక నటి తమన్నా సింహాద్రి కూడా హేమా పై సెన్సేషనల్ కామెంట్లు చేయడంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

హేమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా సింహాద్రి..

Tamanna Simhadri: Tamanna who made shocking comments saying Hema's life is the same..!
Tamanna Simhadri: Tamanna who made shocking comments saying Hema’s life is the same..!

హేమా పై ప్రముఖ నటి తమన్నా సింహాద్రి కామెంట్లు చేస్తూ హేమక్క బ్రతుకు అదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.. కావాల్సిన వాళ్లకు అమ్మాయిలను సరఫరా చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది అంటూ వివరించింది.. ఇక అసలు విషయంపై ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి మాట్లాడుతూ.. మా అక్క రేవ్ పార్టీలో బెంగళూరులో దొరికిపోయింది.. అక్క అనేక పార్టీలలో దొరుకుతూ ఉంటుంది.. గుంటూరులో కూడా ఒకసారి ఒక పార్టీలో దొరికిపోయి.. వాళ్ళ వీళ్ళ సహాయంతో బయటపడింది.. అక్క ఏం బాహుబలి సినిమా హీరోయిన్ కాదు.. చేసేవి చిన్నా చితకా క్యారెక్టర్లు మాత్రమే.. కానీ అక్కకు ఉన్న ఆస్తులు చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు అంటూ చెప్పుకొచ్చింది.

అమ్మాయిలను సరఫరా చేస్తూ డబ్బు సంపాదిస్తోంది..

బెంగళూరులో రేవ్ పార్టీలో దొరికిపోయిన తర్వాత నేను బెంగళూరులో లేను.. హైదరాబాదులో ఉన్నాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది.. అక్క బ్రతుకు అదే.. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన అమ్మాయిలకు అవకాశాలు ఇప్పిస్తానని ఎరగా వాడుకుంటూ డబ్బులు సంపాదిస్తోంది అంటూ తమన్నా సింహాద్రి సెన్సేషనల్ కామెంట్లు చేసింది.. ప్రస్తుతం తమన్నా సింహాద్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.. ఇక పైగా తమన్నా సింహాద్రి చేసిన కామెంట్లకు చాలామంది సెలబ్రిటీలు మద్దతు ఇస్తున్నారు.. మరి కొంతమంది నెటిజన్లు అయితే ఆమెపై ఏకంగా నెగిటివ్ కామెంట్లు చేస్తూ పూర్తిస్థాయిలో విరుచుకుపడుతున్నారు..

- Advertisement -

రేవ్ పార్టీలో ఏం జరిగింది..

రేవ్ పార్టీలో తెలుగు నటి హేమా, హీరో శ్రీకాంత్ వంటి వాళ్ళు పాల్గొన్నట్లు తెలిసింది ..కానీ వీరిద్దరూ తమ ఇంట్లోనే ఉన్నట్లుగా వీడియోలు విడుదల చేశారు.. శ్రీకాంత్ ఏకంగా తన ఇంటిని కూడా చూపించారు.. కానీ నటి హేమ మాత్రం తాను ఒక ఫామ్ హౌస్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.. రేవ్ పార్టీకి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చింది. వెంటనే పోలీసులు రియాక్ట్ అవుతూ .. హేమ తమ కుటుంబ సభ్యులకు విషయం చెబుతాను అంటే ఫోన్ ఇచ్చాము. కానీ ఆమె ఫోన్ సహాయంతో ఒక వీడియో తీసి ప్రజలను తప్పుదోవ పట్టించింది.. అందుకే హేమాను అదుపులోకి తీసుకున్నాము.. ఆవిడ డ్రగ్స్ కూడా తీసుకున్నట్టు రక్త నమూనాలో తేలింది అంటూ పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఈ విషయం తెలిసి పలువురు నెటిజెన్లు , సినీ ప్రేక్షకులు కూడా ఈమెకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు