Salaar2 : ప్రభాస్ సినిమా ఆగడం వల్ల ఆ సంస్థకు మంచిదయిందా?

Salaar2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ లో అందరికంటే ఎక్కువ సినిమాలు లైన్లో పెట్టాడు ప్రభాస్. కల్కి2898AD సినిమాతో పాటు, రాజా సాబ్, స్పిరిట్, సలార్2 తో పాటు హను రాఘవపూడి తో కూడా ఒక సినిమా ఉంది. ఇదిలా ఉండగా ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ లాస్ట్ ఇయర్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని ఏకంగా 700+ కోట్లకి పైగా కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక సలార్ కి రెండో భాగంగా సలార్2 (శౌర్యంగపర్వం) ఉంటుందని ప్రశాంత్ నీల్ అప్పుడే క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాతే ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి వెళ్తాడని అందరూ భావించారు. ఇక సలార్ షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుందని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఎందుకనో సడన్ గా ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రశాంత్ నీల్ సలార్ 2 మూవీని వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

The postponement of Salaar2 project is a plus point for Mythri movie makers

ఎన్టీఆర్31 నే ముందు తీస్తాడా?

అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా వస్తున్న వార్తల ప్రకారం దీనికంటే ముందుగా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాని ముందుగా సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నాడట. ఎన్టీఆర్ బర్త్ డే రోజున మైత్రీ మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్ మూవీ గురించి పోస్టర్ తో కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆగష్టు నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ లోపు ప్రభాస్ కల్కి2898AD, రాజా సాబ్ సినిమాలు పూర్తి చేసుకుని స్పిరిట్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడట. ఇది పూర్తయ్యాక సలార్ 2 పై ఫోకస్ చేసే ఛాన్స్ ఉందని టాక్. అయితే సలార్2 మూవీ ఇప్పుడు వాయిదా పడటం ఒక బడా నిర్మాణ సంస్థకు కూడా బాగా కలిసొచ్చింది. ఆ సంస్థ మరేదో కాదు.. మైత్రీ మూవీ మేకర్స్.

- Advertisement -

సలార్2 వాయిదా మైత్రి కి ప్లస్..

ఇక సలార్2 (Salaar2) సినిమా వాయిదా పడడం మైత్రి మూవీ నిర్మాతలకు చాలా ప్లస్ అయ్యిందనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోనే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతుంది. అలాగే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో మూవీ కూడా లైన్ లో ఉంది. ఈ సినిమాని కూడా వీలైనంత వేగంగా సెట్స్ పైకి తీసుకొని వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇక సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీని ఈ ఏడాది ఆఖరులో స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉండగా, అంతకంటే ముందుగానే హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. ఒక్క సలార్ వాయిదా పడటం వలన మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే కావడం విశేషం. అయితే సలార్ 2 మూవీ షూటింగ్ వాయిదా పడలేదని, ఖచ్చితంగా జరుగుతుందనే మాట కూడా వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ నుంచి తారక్ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ప్రభాస్ ఇప్పటికే కల్కి2898AD షూటింగ్ పూర్తి చేసేయగా, రాజా సాబ్ షూటింగ్ ఆగష్టు లోగా పూర్తి చేసి, అదే నెలలో హను రాఘవపూడితో సినిమా మొదలు పెట్టె అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు