Kalki2898AD : ప్రభాస్ ని ‘అవెంజర్స్’ లో ఆ పాత్రతో పోలుస్తున్న నెటిజన్లు!.. చూస్తుంటే అలాగే ఉంది..!

Kalki2898AD : రెబల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా నాగ్ అశ్విన్ చేస్తున్న భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్రం కల్కి 2898AD. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో భైర‌వ పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న సినిమా యూనిట్ ప్రమోషన్లలో బిజీ అయ్యారు. ఇక నాలుగు రోజుల కింద బుజ్జి అనే కార్ పాత్రను పరిచయం చేస్తూ, మొదలైన ప్రమోషన్ నిన్న బుజ్జి కార్ ని డైరెక్ట్ గా టీజర్ ద్వారా లాంచ్ చేసి ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఇక నిన్న ఇండియా వైడ్ గా టీజర్ ట్రెండ్ అయింది. ఇక అలాగే ఈ చిత్రంలో బుజ్జి పాత్ర ఎంతో కీల‌క‌మైన‌ది. కాగా ఆ బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. భైరవకు స‌హ‌క‌రించే ఒక అసిస్టెంట్ గా కార్ రోల్ ని డిజైన్ చేసారు మేకర్స్. ఇదిలా ఉండగా భైరవ పాత్రను హాలీవుడ్ మూవీ ఫ్రాంచైజెస్ లో ఫేమస్ అయిన అవెంజర్స్ లో హీరో పాత్రతో పోలుస్తున్నారు నెటిజన్లు.

Netizens are comparing Prabhas with the character of Thor

ప్రభాస్ ని థోర్ తో పోలుస్తున్న నెటిజన్లు..

ఇదిలా ఉండగా ప్రభాస్ ని హాలీవుడ్ సూపర్ హిట్ అవెంజర్స్ సిరీస్ లో థోర్ పాత్రతో పోలుస్తున్నారు నెటిజన్లు. అయితే చూడ్డానికి ప్రభాస్ వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా థోర్ లాగే ఉన్నాయ్. ఆలాగే ఆరడుగుల కటౌట్ ఉన్న ప్రభాస్ థోర్ లాగే పవర్ ఫుల్ గా ఉంటాడు. ఇక థోర్ అవెంజర్స్ లో ఒడియన్ దేవుడి కుమారుడుగా పాత్ర ఉంటుంది. ఇక అలాగే కల్కి లో సాక్షాత్ దేవుడి పాత్రే కాబట్టి అద్భుత శక్తులుంటాయని సమాచారం. ఇకపోతే ప్రభాస్ దగ్గర ఉండే బుజ్జి పాత్ర ని అవెంజర్స్ లో ఐరన్ మ్యాన్ కి సహకరించే సూట్ పాత్ర ని ప్రేరణ గా తీసుకుని తయారు చేసారని తెలిసిందే. ఇక కమల్ హాసన్ పాత్ర అవెంజర్స్ లో థానోస్ పాత్ర స్వభావాన్ని పోలి ఉంటుందని ఒక అంచనా. ఏది ఏమైనా కల్కి సినిమా నుండి రానున్న మరిన్ని అప్డేట్స్ సినిమాపై మరిన్ని అంచనాలని పెంచనున్నాయని చెప్పొచ్చు.

- Advertisement -

పాన్ వరల్డ్ రేంజ్ లో కల్కి..

ఇక ప్రభాస్ కల్కి (Kalki2898AD) సినిమా ప్రమోషన్లు ఇప్పటినుండి పీక్స్ లో ఉంటాయని చెప్పొచ్చు. నిన్న అభిమానుల స‌మ‌క్షంలో కస్టమ్ మేడ్ వాహనాన్ని హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో లాంచ్ చేయగా, అక్క‌డ పూర్తిగా ఒక కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించారు నాగ్ అశ్విన్. ప్ర‌భాస్ ఈ టీజ‌ర్ లో భారీత‌నం నిండిన కాస్ట్యూమ్‌లో క‌నిపించాడు. ప్ర‌యోగాలు చేసేవాడిగా మిస్టీరియ‌స్ గా క‌నిపిస్తున్నాడు. ఇక బుజ్జి టీజర్ క‌ల్కి చిత్రంపై భారీ అంచ‌నాల‌ను పెంచింద‌నడంలో సందేహం లేదు. ఇది పూర్తిగా కొత్త ర‌కం సినిమా అంటూ అమితాబ్ , దీపిక ప‌దుకొనే చాలా కాలం క్రిత‌మే వెల్ల‌డించారు. వీళ్లంతా ఎందుకు అలా చెప్పారో ఈ టీజ‌ర్ తో క్లారిటీ వ‌చ్చేసింది. వైజ‌యంతి మూవీస్ బ్యానర్ పై అశ్వని ద‌త్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జూలై లో ఈ చిత్రం పాన్ ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ రేంజ్ లో 22 భాషల్లో రిలీజ్ కానుందని సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు