Ranbir Kapoor : కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్న రణబీర్ – అలియా… బంగ్లా వ్యాల్యూ రేంజ్ తెలుసా?

Ranbir Kapoor : బాలీవుడ్ కపూర్ ఫ్యామిలీ స్టార్స్ అయిన రణబీర్ కపూర్ – అలియా భట్ జంట వరుస సినిమాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇక లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో అనిమల్ తో పాన్ ఇండియా హిట్ సాధించిన రణబీర్ కపూర్ ఇప్పుడు ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ తో బిజీగా ఉన్నాడు. ఇక అలియా భట్ కూడా వరుస సినిమాలతో విసిగా ఉంది. ఇక ఏడాదిన్నర కింద ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కూతురికి రాహా అని పేరు పెట్టారు. ఇక కూతురు కోసం కొత్త కాలం సినిమాలకి దూరంగా ఉన్న అలియా వరుస ప్రాజెక్టులతో బిజీ కానుంది. ఇదిలా ఉండగా తాజాగా వార్తల ప్రకారం రణబీర్ అలియా ఫ్యామిలీ తమ కొత్త బంగ్లాకు షిఫ్ట‌య్యేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలా కాలంగా ఈ అరుదైన క్ష‌ణం కోసం ఉత్కంఠ‌గా వేచి చూస్తున్న ఈ జంట‌కు ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సొంత విల్లా భారీ నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. ఇక ఈ జంట ఈ సంవత్సరం దీపావళిని వారి కొత్త ఇంటిలో సెల‌బ్రేట్ చేసుకునే అవకాశం ఉందని హిందూస్తాన్ టైమ్స్ ప్రత్యేకంగా నివేదించింది. ఇక చాలా కాలంగా ఎదురుచూస్తూ నిర్మాణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది ఈ జంట‌.

Ranbir Kapoor Alia Bhatt's new house is worth 250 crores

తొందర్లోనే కొత్త ఇంట్లోకి ప్రవేశం..!

ఇక రాబోయే రెండు మూడు నెలల్లో అలియా, రణ్‌బీర్‌ తమ కూతురు రాహా తో తమ కొత్త బంగ్లాలోకి మారబోతున్నారని సమాచారం. ఇక బంగ్లా తుదిమెరుగుల‌కు సంబంధించిన పని దాదాపు పూర్తయిందట. ఇత‌ర ప‌నుల‌కు ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని, పని పూర్తయి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత దంపతులు అక్కడికి చేరుకుంటారని సమాచారం. ఇక రణబీర్ , అలియా తమ బిజీ షెడ్యూల్ నుండి సమయాన్ని వెచ్చించి భ‌వంతి నిర్మాణ‌ పని స్థితిని తనిఖీ చేస్తున్నారట. ఇక ఈ బంగ్లా స్థ‌లం నిజానికి రణబీర్ తాతలు, రాజ్ కపూర్ , కృష్ణ రాజ్‌లకు చెందినది. దివంగత రిషి కపూర్ -నీతూ 1980లో ఆస్తిని వారసత్వంగా పొందారు. ఇప్పుడు ర‌ణ‌బీర్ – ఆలియా చేతికి చిక్కుతోంది. క‌పూర్ కుటుంబ వార‌స‌త్వ ఆస్తి కావ‌డంతో సెంటిమెంటు ముడిప‌డి ఉంది.

- Advertisement -

షారూఖ్‌, అమితాబ్ ఇంటి కంటే ఖ‌రీదు..

ఇక ఈ కొత్త బంగ్లాకు రణబీర్ కి సుమారు రూ.250 కోట్లు ఖర్చయింద‌ని స‌మాచారం. షారుఖ్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సాలను బంగ్లా లను అధిగమించి ముంబైలోని అత్యంత ఖరీదైన సెలబ్రిటీ బంగ్లా ఇది ఇటీవ‌ల మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఇక ర‌ణ్‌బీర్ -అలియా ఇద్దరూ కష్టపడి సంపాదించిన డబ్బును తమ కలల ఇంటిని నిర్మించడానికి సమానంగా పెట్టుబడి పెడుతున్నారట. అన్నీ పూర్తయేప్ప‌టికి ఇల్లు కోసం రూ.250 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని స‌మాచారరం. ఈ బంగ్లాను త‌మ కుమార్తె రాహాకు గిఫ్ట్ గా ఇస్తున్నామ‌ని ఇంత‌కుముందే ర‌ణ‌బీర్ – ఆలియా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ విధంగా బేబి రాహా ముంబై ప‌రిశ్ర‌మ‌లోనే రిచెస్ట్ సెల‌బ్రిటీ కిడ్ గా మారింది. ఇక ఆలియా భట్ తన తదుపరి చిత్రం జిగ్రా షూటింగ్‌ను పూర్తి చేసింది. తర్వాత సంజయ్ లీలా భన్సాలీ తదుపరి చిత్రం “లవ్ అండ్ వార్‌” ను అలియా భట్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమా క్రిస్మస్ కానుకగా 2025న విడుదల కానుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు