Mega157 : ఇక అనుమానాలు తీరినట్లేనా? చిరు 157 డైరెక్టర్ అతనేనా?

Mega157 : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉండదనుందన్న వార్తలు వస్తూనే ఉన్నాయ్. చాలా రోజులుగా దీనిపై పలు రకాల దర్శకుల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కృష్ణ చైతన్య, హరీష్ శంకర్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్ ఎలా ఎందరో దర్శకులు చిరంజీవికి స్క్రిప్ట్ వినిపించడం జరిగింది. వీళ్ళలో కొందరు దర్శకుల కథలు హోల్డ్ లో పెట్టడం కూడా జరిగింది. కానీ చిరంజీవి విశ్వంభర తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనే సందేహాలకు మెల్లగా స్పష్టత వస్తోందని తెలుస్తుంది. తాజాగా ఓ మెగా పిక్ ఈ సందేహాలకు తెర దించుతున్నట్లు తెలుస్తుంది.

Mohan Raja to direct Chiranjeevi's Mega 157 movie

మెగా 157 దర్శకుడు ఇతడేనా?

రెండేళ్ల కింద లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ తో బ్లాక్ బస్టర్ కాకపోయినా తనకో మంచి మూవీ ఇచ్చాడన్న అభిమానం దర్శకుడు మోహన్ రాజా మీద మెగాస్టార్ చిరుకు ఉంది. ఆ సినిమా రిలీజ్ టైంలో మరో అవకాశం ఇస్తానని కూడా అన్నారు. ఇప్పుడా దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం. రచయిత బివిఎస్ రవి ఇచ్చిన కథను ప్రస్తుతం పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా మలిచే పనిలో మోహన్ రాజా టీమ్ ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం తను జయం రవితో తని ఒరువన్ 2 పూర్తి చేసే హడావిడిలో మోహన్ రాజా ఉన్నాడు. ఆ తర్వాత చిరంజీవి (Mega157) సినిమాకి సంబంధించిన పనులు మొదలవుతాయట. ఈ లోపు చిరు విశ్వంభర కూడా పూర్తి చేసేస్తారని సమాచారం. అయితే ఈ సినిమా ఉండబోతుందని ఇంత బలంగా చెప్పడానికి కారణం ఉంది.

- Advertisement -

మెగా పిక్ తో అనుమానాలకు తెర!

రీసెంట్ గా జనసేన పార్టీ నుండి అఖండ మెజార్టీ తో గెలిచిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతూ మోహన్ రాజా ఫోటోలతో ఒక ట్వీట్ చేశాడు. అందులో చిరు, పవన్ ఇద్దరూ ఉన్నారు. దాన్నే బివిఎస్ రవి కూడా రీ ట్వీట్ చేస్తూ విష్ చేశారు. ఇద్దరూ చెప్పింది రాజకీయ శుభాకాంక్షలే అయినా ప్రాజెక్టు లైన్ లో ఉన్నందుకే వెంటనే స్పందించారనేది కాదనలేని వాస్తవం. మరి లేకపోతే అదే పనిగా మోహన్ రాజా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి అన్నదమ్ములని కలిసి గ్రీటింగ్స్ చెప్పడుగా అనేది ఇంకో పాయింట్. ఏది ఏమైనా మెగా 157 కు సంబంధించిన అడుగులు వేగంగా పడుతున్నాయి. కానీ ఒరిజినల్ కథలు డీల్ చేసిన అనుభవం మోహన్ రాజాకు తక్కువ. ఒక్క తని ఒరువన్ మాత్రమే ఆయన మెప్పించిన స్ట్రెయిట్ సబ్జెక్టు. మిగిలినవన్నీ తమిళ, తెలుగు బ్లాక్ బస్టర్ల రీమేకులే. మరి చిరంజీవి ఆఫర్ ని వాడుకుని తనను తాను ప్రూవ్ ఎలా చేసుకుంటారో చూడాలి. ఇక విశ్వంభర పూర్తి కాగానే ఆలస్యం కాకుండా మోహన్ రాజాతో సినిమా మొదలు పెడతారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు