Love Me: సినిమా రిలీజ్ కి ముందే సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు

Love Me: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి అనుసంధానంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్లు వేణుని దర్శకుడుగా పరిచయం చేస్తూ బలగం అనే సినిమాను చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి ఓటీటీ లో కూడా అదే స్థాయిలో ఆదరణ లభించింది. ఒక కొత్త బ్యానర్ ఇటువంటి మంచి సినిమాతో స్టార్ట్ అవటం అనేది శుభ సూచకమని అందరూ నమ్మారు. ఇకపోతే ఈ బ్యానర్లో ఇలాంటి సినిమాలే రావాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ హర్షిత్ రెడ్డి.

Balagam

బలగం తో మొదలైన బ్యానర్

ఇకపోతే ఈ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమా లవ్ మీ. ఈ సినిమా గురించి ఒక సందర్భంలో దిల్ రాజు మాట్లాడుతూ ఆర్య సినిమా తర్వాత మళ్లీ అలాంటి వైబ్స్ వచ్చిన ఒక కథ విన్నాను అదే లవ్ మీ. అయితే దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కి మంచి బ్రేక్ ఇచ్చిన ఆర్య సినిమాతో పోల్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది సినిమా రిలీజ్ కోసం క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేశారు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ఎం ఎం కీరవాణి మ్యూజిక్ లో ఈ సినిమా రాబోతుంది.

- Advertisement -

అంచనాలను పెంచిన ట్రైలర్

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను రీసెంట్గా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే దెయ్యాన్ని వెతుక్కుని వెళ్లే ఒక యువకుడు ఆ దయ్యంతో ప్రేమలో పడటం అనేది సినిమా కథల అనిపిస్తుంది. దీంతోపాటు ఈ సినిమాలో ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పే ప్రయత్నం దర్శకుడు చేశాడు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ నటిస్తుంది.

సీక్వెల్ కూడా ప్లానింగ్

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో ప్రతి సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేస్తూ వెళ్తున్నారు. మామూలుగా మొదలైన సినిమాలన్నీ కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అంటూ చెప్పడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈ లవ్ మీ సినిమా కూడా సీక్వెల్ ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీక్వెల్ అనేది ఫస్ట్ సినిమా యొక్క రిజల్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా మే 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ఈ సినిమాకి సీక్వెల్ కి ఆస్కారం ఉందో లేదో తెలియనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు