Bujji from Kalki 2898 AD : తెలుగులో బుజ్జి కోసం మహానటి… మరి హిందీ బుజ్జి కోసం ఎవరంటే…?

Bujji from Kalki 2898 AD : గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా బుజ్జి.. బుజ్జి.. అనే వినిపించింది. రెండు రోజుల క్రితం.. ఎవరా బుజ్జి..? ఎలా ఉంటుంది..? కల్కీ సినిమాలో ఈ బుజ్జి ఏం చేస్తుంది ? అనే ప్రశ్నలు ఉండేవి. కానీ, ఈ నెల 22న రాత్రి కల్కీ టైం బుజ్జిని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి రివీల్ చేశారు.

దాదాపు 6 టన్నుల ఉన్న ఓ భారీ వెహికలే బుజ్జి అని తెలిసింది. కల్కీ సినిమా కోసమే ప్రత్యేకంగా దీన్ని తయారు చేశారు. సినిమాలో ప్రభాస్ పాత్ర తర్వాత బుజ్జి చాలా కీలకంగా ఉండబోతుందని ఇప్పటికే తెలిసిపోయింది. అయితే ఈ బుజ్జిని సినిమా కోసం మాత్రమే కాదు, సినిమా ప్రమోషన్స్ కి కూడా గట్టిగానే వాడుతున్నారు. ఇప్పటికే బుజ్జిని రివీల్ చేసిన ఈవెంట్‌తో సినిమాకు భారీ హైప్ వచ్చింది.

తెలుగు బుజ్జి…

బుజ్జి వెహికల్ కి మైండ్ ఉంటుంది. బాడీ ఉంటుంది. దీనికి మాటలు కూడా వస్తాయి. ఈ మాటలు అందించింది మహానటి కీర్తి సురేష్. బుజ్జికి మాటలు అందించిన కీర్తి, డబ్బింగ్ చెప్పిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ప్రత్యేక శ్రద్దతో, స్పెషల్ స్లాంగ్‌తో బుజ్జికి కీర్తి చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

- Advertisement -

అయితే కీర్తి మాటలు తెలుగు బుజ్జి కి మాత్రమే పరిమితం కానున్నాయి. కానీ, కల్కీ మూవీ పాన్ ఇండియా మూవీ. కాబట్టి… ఇప్పుడు హిందీ బుజ్జికి మాటలు అందించేది ఎవరు ? అనే డౌట్ చాలా రోజుల నుంచి వస్తుంది. అయితే దీనిపై ఫైనల్ గా ఓ క్లారిటీ వచ్చింది.

Bujji from Kalki 2898 AD
Bujji from Kalki 2898 AD

హిందీ బుజ్జి…

హిందీ రాష్ట్రాల్లో కూడా కల్కీ మూవీకి మంచి బజ్ ఉంది. దీనికి కారణం, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్, టాల్ హీరోయిన్ దీపికా పదుకొనెతో పాటు హాట్ బ్యూటీ దిశా పటానీ ఈ సినిమాలో నటించడమే అని చెప్పొచ్చు. అందుకే హిందీ బెల్ట్ రాష్ట్రాలను కూడా మూవీ టీం ఛాలెంజ్ గా తీసుకుంది. అక్కడ కూడా ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేస్తుంది.

ప్రభాస్ కోసం సాహో బ్యూటీ…

అయితే హిందీ బుజ్జి కోసం ప్రభాస్ తో సాహో సినిమాలో స్క్రిన్ షేర్ చేసుకున్న శ్రద్దా కపూర్ డైలాగ్స్ అందించబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Shraddha Kapoor will be giving Voice Over for BUJJI in Hindi
Shraddha Kapoor will be giving Voice Over for BUJJI in Hindi

నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కల్కీ మూవీలో పాత్రలకు స్టార్ కాస్ట్ ను తీసుకున్నారు. ఇప్పుడు అందులోనే వెహికిల్ కు డబ్బింగ్ చెప్పడానికి కూడా స్టార్ కాస్ట్ నే తీసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు