Anand Deverakonda: బేబీ సినిమా తర్వాత తమిళ్ డైరెక్టర్లు అప్రోచ్ అయ్యారు

Anand Deverakonda: నువ్విలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే సినిమాలతో కొద్దిపాటి గుర్తింపును సాధించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సాధించుకొని పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్ కెరీర్ కు మంచి ప్లస్ అయింది. ఇకపోతే విజయ్ కి తన తమ్ముడు ఆనంద్ ఎంత సపోర్ట్ చేశాడో ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు.

దొరసాని సినిమాతో ఎంట్రీ

దొరసాని అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆనంద్ కూడా హీరోగా ఎంటర్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ను సాధించలేకపోయింది. కానీ ఆనంద్ మాత్రం వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే వచ్చిన ప్రతి సినిమాను చేయకుండా తనకు నచ్చిన ప్రతి సినిమాను ఓకే చేస్తూ పట్టా లెక్కించాడు ఆనంద్. ఆనంద్ మంచి కథలు ఎంచుకొని ముందుకు వెళుతున్నాడు అని చెప్పడానికి ఆనంద్ నుంచి వచ్చిన సినిమాలే నిదర్శనమని చెప్పొచ్చు. మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం వంటి సినిమాలు ఆనంద్ కెరియర్ లో డీసెంట్ హిట్ గా నిలిచాయి.

Anand Deverakonda

- Advertisement -

బేబీ సినిమాతో బ్రేక్

ప్రతి హీరోకి ఒక సినిమాతో బ్రేక్ అనేది వస్తుంది. అలా ఆనంద్ కి బ్రేక్ ఇచ్చిన సినిమా బేబీ. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకొని బీభత్సమైన కలెక్షన్స్ వసూలు చేసింది. నిజంగా జరిగిన ఒక సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ బేబీ అనే కథను రాసుకున్నాడు దర్శకుడు సాయి రాజేష్. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కూడా రీసెంట్ గా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

బేబీ సినిమా ఇంపాక్ట్ అంతలా ఉంది

ఇక ప్రస్తుతం ఆనంద నటిస్తున్న సినిమా గంగం గణేశా ఈ సినిమా మే 31న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఆనంద్. అయితే పెద్ద డైరెక్టర్లు మీతో సినిమా చేద్దామని అప్రోచ్ అయ్యారా అని అడిగిన ప్రశ్నకు. పెద్ద డైరెక్టర్లు నాతో అప్రోచ్ అవడం లేదు దాదాపు 50 మంది కొత్త డైరెక్టర్లు కథలు చెప్పడానికి వస్తే వాళ్లలో 20 నుంచి 25 వరకు తమిళ్ డైరెక్టర్లు ఉంటారు అంటూ చెబుతూ వచ్చారు ఆనంద్. ఇకపోతే బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ నుంచి కూడా దర్శకులు వచ్చి ఆనంద్ సినిమా చేయాలి అనుకుంటున్నారంటే బేబీ ఇంపాక్ట్ అంతలా ఉందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు