Sitara Ghattamaneni: ఖలేజా సినిమాలోని క్యారెక్టర్ చేయాలని ఉంది

Sitara Ghattamaneni: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా కూడా మహేష్ అభిమానులకు ప్రత్యేకమని చెప్పొచ్చు. మహేష్ పర్ఫామెన్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువ అవుతుంది. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన కూడా మహేష్ మాత్రం యాక్టర్ గా ఇప్పుడు ఫెయిల్ కాలేదు అని చెప్పొచ్చు. ఎప్పుడూ కొత్తగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు మహేష్.

Mahesh Babu khaleja
మహేష్ ఖలేజా

త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఖలేజా. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఈ సినిమాకి టీవీలో ఇప్పటికీ కూడా టిఆర్పి రేటింగ్ బీభత్సంగా వస్తుంది. ఈ సినిమాలో సీతారామరాజు అనే ఒక పాత్రలో నటించాడు మహేష్ బాబు. ఒక టాక్సీ డ్రైవర్ గా కనిపించి అందర్నీ బీభత్సంగా ఎంటర్టైన్ చేశాడు. దేవుడు అనే కాన్సెప్ట్ ను చాలా అద్భుతంగా ఈ సినిమాతో చెప్పాలనుకున్నాడు త్రివిక్రమ్ కానీ ఈ సినిమా మిస్ ఫైర్ అయ్యింది. ఇకపోతే ఎప్పటికీ చాలామందికి ఈ సినిమా ఒక ఫేవరెట్ అని చెప్పాలి.

ఖలేజా ఫ్యాన్స్

ఖలేజా సినిమాకి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇకపోతే మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని రీసెంట్ గా డిజిటల్ థియేటర్స్ తో ఒక చిట్ చాట్ లో పాల్గొన్నారు. అయితే ఈ చాట్ లో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు సితార. మహేష్ బాబు చేసిన సినిమాలు అన్నిటిలో కంటే కూడా ఖలేజా సినిమా తనకు చాలా ఇష్టమని సీతారామరాజు లాంటి క్యారెక్టర్ తన కూడా చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. అలానే వాళ్ల పేరెంట్స్ ఇద్దరు కూడా తనతో చాలా ఫ్రీగా ఉంటారని ఇద్దరిలో ఎవరు కూడా స్ట్రీట్ కాదని చెప్పుకొచ్చారు సితార.

- Advertisement -

ఇకపోతే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రీసెంట్గా గుంటూరు కారం అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాకి మొదటి నుంచి నెగిటివ్ టాక్ మొదలైంది. మహేష్ బాబు కి ఉన్న ఫ్యామిలీ ఫాలోయింగ్ వలన ఈ సినిమా సేఫ్ జోన్ లో కి వచ్చింది. సంక్రాంతి కానుక రిలీజైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ను రాబట్టింది. అదే ఈ సినిమాకి ఇట్ టాక్ వచ్చి ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ ఇంకొంచెం మెరుగ్గా ఉండేవి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు