Kartikeya’s Bedurulanka 2012: ఆ సినిమాకు సీక్వెల్ – బేబీ ఇన్స్పిరేషనా..?

Kartikeya’s Bdurulanka 2012

కార్తికేయ హీరోగా పరిచయమైన ఆరెక్స్ 100 సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. యూత్ ఫుల్ కంటెంట్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే, ఈ సినిమా తర్వాత అటు హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి ఆ రేంజ్ హిట్ దక్కలేదు.ప్రస్తుతం బెదురులంక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న కార్తికేయ ఆరెక్స్ 100 సినిమాకు సీక్వెల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బెదురులంక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికేయ డైరెక్టర్ అజయ్ భూపతి తో మరో సినిమా ఉంటుందని, అది ఆరెక్స్ 100 కి సీక్వెల్ ఆ కాదా అన్నది కచ్చితంగా చెప్పలేనని అన్నాడు. తమ కాంబినేషన్లో రాబోయే సినిమా కచ్చితంగా సెన్సేషనల్ సినిమా అవుతుందని అన్నాడు కార్తికేయ. ప్రస్తుతం చాలా స్క్రిప్ట్స్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని, త్వరలోనే అజయ్ భూపతి సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ ఉంటుందని అన్నాడు.

ఆరెక్స్ 100 తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతికి కూడా సరైన హిట్ దక్కలేదు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తో మంగళవారం సినిమా చేస్తున్నాడు అజయ్ భూపతి. ఇటీవల చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన బేబీ కూడా ఆరెక్స్ 100 తరహాలోనే యూత్ కి కనెక్ట్ అయ్యే కథతో వచ్చి హిట్ అయిన నేపథ్యంలో ఆరెక్స్ 100 సీక్వెల్ నెటిజన్స్ లో ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. మరి, ఇటీవలి కాలంలో సరైన హిట్ లేక సతమతం అవుతున్న కార్తికేయకి అజయ్ భూపతి సినిమాతో అయినా హిట్ దక్కుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు