Adipurush Movie: చంద్రయాన్-3 సక్సెస్… ప్రభాస్‌కి ఎంత కష్టమొచ్చింది!

Adipurush Movie

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ అయింది. నిన్నటి నుంచి ఎక్కడా చూసిన జాబిల్లిపై భారతదేశ పతాకం రెపరెలాడుతున్న ఫోటోలే కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కానీ విజయం ISROకి సాధ్యం అవ్వడంతో, ఈ విజయాన్ని యావత్ దేశం మొత్తం సెలబ్రెట్ చేసుకుంటుంది. ఇలాంటి టైంలో ఒక ట్రోల్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

అదేంటంటే…. ఎన్నో అంచానలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్దకు వచ్చి బొక్కబోర్లాపడ్డ ఆదిపురుష్ మూవీ. ఇదేంటి..? చంద్రయాన్-3కి, ఆదిపురుష్ సినిమాకి, ప్రభాస్‌కి ఏం సంబంధం అని అనుకుంటున్నరా..?

నిజానికి వీటి మధ్య ఎలాంటి సంబంధం లేదు. కానీ, నెట్టింట్లో ఖాళీగా ఉన్నవాళ్లు దేనికి ఏదైనా లింక్ చేస్తారా కదా.. ఇప్పుడు ఈ రెండింటికీ లింక్ చేశారు. ఎలా అంటే “బడ్జెట్”.

- Advertisement -

చంద్రయాన్-3 బడ్జెట్ 615 cr. ఇంత తక్కువ బడ్జెట్‌తో జాబిల్లి వరకు వెళ్లి ప్రపంచానికి సాధ్యం కానింది చేసి చూపించారు.

ఆదిపురుష్ బడ్జెట్ 600+ cr. ఇంత భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ మూవీ రామయాణానికి మచ్చె తెచ్చేలా, ప్రేక్షకుల ఆగ్రహానికి గురి అయ్యేలా చేశారు.

ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తున్నారు. సైంటిస్ట్‌లను చూసి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నెర్చుకోవాలని, తక్కువ బడ్జెట్‌తో విజయం సాధించడం ఎలానో సైంటిస్ట్‌ల దగ్గరికి వెళ్లి క్లాస్‌లు తీసుకోవాలని ట్రోల్స్ చేస్తున్నారు. అలా డిజాస్టార్ మూవీ ఆదిపురుష్‌తో పాటు ప్రభాస్ (Prabhas) మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు