Anand Deverakonda latest movie: మరో కొత్త కాన్సెప్ట్‌తో ఆనంద్ దేవరకొండ

Anand Deverakonda latest movie

బేబీ సినిమాతో ఈ ఏడాది సూపర్ సక్సెస్ అందుకున్న ఆనంద్ దేవరకొండ తరువాత చేయబోతున్న సినిమాలలో స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. కెరీర్ బిగినింగ్ నుంచే కొత్త కాసెప్ట్స్ లతో, విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ ప్రామిసింగ్ హీరోగా ఎదుగుతున్న ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

దొరసాని సినిమాతో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండకు మొదటి సినిమానే బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఆ తరువాత తన పంథాను మార్చుకొని మళ్ళీ కమర్షియల్ సినిమాల వైపుకు వెళ్తాడనుకుంటే ఆనంద్ దేవరకొండ కాసెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలనే ఎంచుకుంటు సినిమాలు చేస్తున్నాడు.

దొరసాని సినిమా తరువాత, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, హైవే సినిమాలు చేసిన ఆనంద్ దేవరకొండ ఈ ఏడాది జులై 14 న రిలీజైన బేబీ సినిమాతో మొదటి సక్సెస్ అందుకున్నాడు. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బేబీ సినిమా ఆనంద్ దేవరకొండకు సక్సెస్ ఇవ్వడమే కాక 100 కోట్ల హీరోను కూడా చేసింది.

- Advertisement -

ఇక బేబీ సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ ఆనంద్ దేవరకొండ హీరోగా హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కేదార్ సలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాణంలో గం గం గణేశా అనే సినిమా చేస్తున్నాడు. ఉదయ్ శెట్టి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ ఫుల్ లెన్త్ కామెడీ పాత్రలో నటించబోతున్నారు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్ కు బేబీ మూవీ కారణంగా కొద్దీ రోజులు బ్రేక్ వచ్చింది. ఇక త్వరలోనే ఈ సినిమా మళ్ళీ సెట్స్ పైకి వెళ్లబోతుందని టాక్. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు