Bedurulanka 2012 Trailer Review: ఆల్రెడీ స్కైలాబ్ వచ్చింది కదా, మళ్లీ అవసరమా…?

Bedurulanka 2012 Trailer Review

కార్తికేయ, నేహా శెట్టి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న బెదురులంక 2012 సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 2012 యుగాంతం రూమర్స్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ సినిమా మీద ఏమాత్రం ఆసక్తి కలించలేకపోయింది. ట్రైలర్ లోనే మొత్తం కథ తెలిసిపోయేలా కట్ చేయటం ఈ ట్రైలర్ కి పెద్ద మైనస్ అయ్యింది. ఆ మధ్య స్కైలాబ్ సినిమా కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చి జనాలను అలరించ లేకపోయింది. ఇప్పుడు బెదురులంక కూడా అలాంటి కాన్సెప్ట్ తోనే రూపొంది జనాల్లో భయాన్ని కామెడీ యాంగిల్ లో చూపించే ప్రయత్నమే అని తెలుస్తోంది.

2012 యుగాంతం కాన్సెప్ట్ మీద అప్పట్లో కంటెంట్ లేనప్పుడల్లా న్యూస్ ఛానల్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవి. 2012 యుగాంతం అనే టైటిల్ తో హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది అప్పట్లో. ఆ సినిమా బి, సి సెంటర్లలో కూడా బాగా ఆడిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఆడియెన్స్ కి ఏ మాత్రం ఫ్రెష్ ఫీల్ ఇవ్వకపోగా విసిగించే అవకాశం ఉంది.

ఎంచుకున్న కథాంశంలో కొత్తదనం లేకపోగా, టేకింగ్ లో కూడా కొత్తదనం లోపించటంతో ట్రైలర్ నిరాశపరిచింది. ఈ ట్రైలర్ లో పాజిటివ్ ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ మాత్రమే అని చెప్పాలి. మరి, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ, రొటీన్ ఫీల్ ఇస్తున్న కామెడీ ట్రాక్ వర్కౌట్ అయితే సినిమా రిలీజయ్యాక డీసెంట్ టాక్ సొంతం చేసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు