Thalaivar’s 170: మొన్న నాని అన్నారు, ఇప్పుడు శర్వా అంటున్నారు..!

Thalaivar’s 170

జై భీమ్ సినిమా డైరెక్టర్ జ్ఞానవేల్ రాజా డైరెక్షన్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ సినిమా చేయనున్నాడని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిన ఈ ప్రాజెక్ట్ లో బిగ్ బీ అమితాబ్ కూడా నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడని కూడా టాక్ వినిపించింది.

అఫీషియల్ అనౌన్స్మెంట్ కి ముందే తరచూ ఏదో ఒక న్యూస్ తో ఆసక్తి పెంచుతున్న ఈ సినిమా విషయంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే, ముందుగా ప్రచారం జరిగినట్టు నాని నటిస్తాడని టాక్ వచ్చిన క్యారెక్టర్లో హీరో శర్వానంద్ కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

గత సంవత్సరం ఒకే ఒక జీవితం సినిమాతో అటు క్రిటిక్స్, ఇటు ఆడియెన్స్ నుండి ప్రశంసలు అందుకున్న శర్వా కొంత గ్యాప్ తీసుకొని ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు చిరంజీవి, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో రానున్న సినిమాలో కూడా శర్వానంద్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం టైర్2 హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్న తరుణంలో రజిని సినిమాలో శర్వానంద్ కి ఆఫర్ వచ్చిన మాట నిజమే అయితే, టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన శర్వానంద్ కి పాన్ ఇండియా వైడ్ గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేని రజినీకాంత్ కి అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చింది జైలర్. జ్ఞానవేల్ డైరెక్షన్లో చేయబోయే సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కూడా మరో సినిమా కమిట్ అయ్యాడు సూపర్ స్టార్. మరి, రజినీకాంత్ సినిమాలో శర్వానంద్ నటిస్తాడా లేదా తెలియాలంటే వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు